న్యూస్ సినిమా

నయనతార రెండో హనీమూన్‌కి అంత ఖర్చు అయ్యిందా..?

Share

ఇటీవల నయనతార-విఘ్నేశ్‌ శివన్‌లు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారు తమ పెళ్లి వేడుకల వీడియోని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేసి రూ.కోట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జంట పెళ్లి తర్వాత దైవదర్శనాలు చేసుకొని ఆ తర్వాత బ్యాంకాక్‌కి హనీమూన్‌కి వెళ్లారు. అక్కడ కూడా ఒక హోటల్ యాజమాన్యం నయన్ జంటకు ఉచితంగా రూమ్ ఏర్పాటు చేసారు. ఎందుకంటే ఎవరైనా సెలెబ్రేటీలు హోటల్‌కి వస్తే పబ్లిసిటీ వస్తుంది కాబట్టి. ఆ తర్వాత నెల రోజులు పాటు షూటింగ్స్‌లో బిజీ అయిపోయింది నయనతార. షూటింగ్స్‌లో కాస్త బ్రేక్ దొరకగానే మళ్లీ ఈ ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి స్పెయిన్‌ని చుట్టి రావడానికి వెళ్లింది.

సెకండ్ హనీమూన్‌కి ఎంత ఖర్చయింది అంటే

మెడలో తాళి కనిపించేలా ఆమె స్పెయిన్ వీధుల్లో భర్తతో కలిసి చక్కర్లు కొడుతోంది. సెకండ్ హనీమూన్‌కి వెళ్లిన నయనతార తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను విఘ్నేశ్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. స్పేయిన్ వీధిలో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట తమ సెకండ్ హనీమూన్‌కి కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అని తెలుస్తుంది. స్పెయిన్‌లో వారు ఉంటున్న హోటల్ రూమ్ రోజుకి రూ.2.5 లక్షలట. అంతేకాకుండా మిగతా ఖర్చులు అదనం అని తెలుస్తుంది. అయినా నయన్, విఘ్నేశ్‌ల జంట వారి సెకండ్ హనీమూన్ అంతగా ఎంజాయ్ చేయడానికి కారణం ఒక ప్రముఖ సంస్థ వీరి హనీమూన్ ట్రిప్‌కి స్పాన్సర్ చేయడమని కొలీవుడ్ మీడియాలో గుసగుసలు వినపడుతున్నాయి.

మరిన్ని విశేషాలు

విఘ్నేశ్‌, నయనతార 7 ఏళ్ల రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత ఈ ఏడాది జూన్ 9న వివాహం చేసుకున్నారు. 2015లో నానుమ్ రౌడీ ధాన్ సెట్స్‌లో మొదటిసారిగా కలుసుకున్నారు. ఆపై ప్రేమలో పడ్డారు. నయనతార పెళ్లయిన తర్వాత కూడా సినిమాలలో ఎప్పటిలాగానే నటిస్తోంది. ఈ నటించిన గోల్డ్ అనే మలయాళం సినిమా సెప్టెంబర్ 8న రానుంది. ఆమె యాక్ట్ చేసిన గాడ్ ఫాదర్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇవి కాకుండా ఆమె తమిళంలో మూడు సినిమాలు హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ ఆ లెవల్లో ఆఫర్స్ పొందడం నిజంగా ఆశ్చర్యమే.


Share

Related posts

20 మంది కో డైరెక్ట‌ర్స్‌కు సాయం: పూరి

Siva Prasad

Pakka commercial : పక్కా కమర్షియల్‌గా స్టైలిష్ గోపీచంద్

GRK

విమానంలో పుట్టిన బిడ్డకు ఇండిగో బంపర్ ఆఫర్!

Teja