Bad Gut Health Leads To Drink & Drive Case: మందు తాగడం తప్పు కాదు గాని, తాగిన తర్వాత డ్రైవింగ్ చేయడం నేరం అని గవర్నమెంట్ వారు చెబుతున్న మాట. అందుకే పోలీస్ వారు సాయంత్రం అయితే చాలు, ఆల్కహాల్ డిటెక్టర్ లు పట్టుకుని, తాగి డ్రైవింగ్ చేసే వారిని పట్టుకోవాలని చూస్తుంటారు. తాగిన వారి నోటినుండి వచ్చే గాలి లోని ఆల్కహాల్ పరిమితిని చూసి అవసరమైన చర్యలు తీసుకోవడం సహజం. కానీ మీకు ఒక రకమైన ఆరోగ్య సమస్య ఉంటె మీరు ఆల్కహాల్ తాగక పోయినా మీ నోటినుండి వచ్చే గాలిలో ఆల్కహాల్ ఉంది మిమ్మల్ని పోలీస్ అరెస్ట్ చేయచ్చని మీకు తెలుసా?

దాని తాలూకు కదా తెలుసుకోండి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) నిర్వహించిన ఒక ఆరోగ్య సదస్సులో ప్రపంచం గర్వించదగిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ , ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి గారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపినందుకు గాను ఆయన స్నేహితుడి కుమార్తె పట్టుబడ్డారు. కానీ ఆమె తన జీవితంలో ఎప్పుడూ మద్యం సేవించనలేదుట. ఇదెలా సాధ్యం అని వివరిస్తూ ఆయన ఎప్పుడూ మద్యం సేవించని వ్యక్తి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడవచ్చు దానికి ఆమె ప్రేగుల ఆరోగ్యం సరిగా లేదని, దాని కారణంగా ఆమె పేగుల్లో ఆల్కహాల్ ఉత్పత్తి జరగడమే ఆమె నోటినుండి ఆల్కహాల్ వచ్చి టెస్ట్ లో పట్టుబడింది చెప్పారు. తర్వాత ఆమె జరిమానా చెల్లించి చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చింది, తర్వాత ఆమె పరిస్థితి అరుదైన వైద్య రుగ్మత కు కారణం అని తేలింది. ఇటువంటి పరిస్థితిని ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్’ అని డాక్టర్ లు పిలుస్తారు ఈ రుగ్మత ఆమె కడుపును బ్రూవరీగా మార్చింది, ఇది ఊహించని మత్తుకు దారితీసింది. తర్వాత ఈ కేసు ను పరిష్కరించడానికి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మరియు వారి బృందం వైద్య పరమైన ఈ రుగ్మతను వివరించారు. ఆ సాక్ష్యాన్ని కోర్టులో సమర్పించారు.
పైన చెప్పిన కేసులో, బాలిక తన చిన్నతనంలోనే ఆమె శరీరం లో చెడు బ్యాక్టీరియా ప్రవేశించింది. సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు, బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోవడం లేదా యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల కూడా ఈ చెడు బ్యాక్టీరియాకు గురవుతారు. కడుపులోని మంచి మరియు చెడు రెండూ ఒకదానితో ఒకటి పోరాడినపుడు చెడు బ్యాక్టీరియా గెలిస్తే, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ” అని డాక్టర్ రెడ్డి గారు వివరించారు.
అందుకని పేగులలో సమస్యలుంటే అనారోగ్యం కలుగుతుంది. ప్రతీ వారు తమ ఆరోగ్యం గురించి మీకు ఏవైనా సమస్యలున్నా ఆందోళనలుఉన్నా, లేదా ఏదైనా అసాధారణ లక్షణాలను కనుగొన్న వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.