Dhordo Tourism Village: మన దేశం లో ప్రతీ రాష్ట్రం లోను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. విదేశీయులు అబ్బురపడే సుందర ప్రదేశాలు కోకొల్లలు. కానీ ఏ రాష్ట్రము లోనైనా పర్యాటక రంగం అభివృద్ధి చెందా లంటే ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉండాలి . దేశం మొత్తానికి గుజరాత్ ప్రభుత్వం ఈ విషయం లో ఆదర్శం గా ఉందని చెప్పాలి. ఇక్కడ పర్యాటక స్థలాల అభి వృద్ధికి పెట్టుబడులలో ప్రభుత్వం ఎన్నో రాయితీలనిస్తోంది. బలంగా పర్యాటక కేంద్రాల ప్రచారం మోడీ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటి నుండే మొదలైంది. అమితాబ్ బచ్చన్ బ్రాండు అంబాసిడర్ గా కొన్ని సంవత్సరాలు ఉన్నారు. విస్తృత ప్రచారం చేశారు. దీనివలన ఎన్నో కొత్త అందమైన ప్రదేశాలకు మంచి గుర్తింపు వచ్చింది.

గుజరాత్ రాష్రమ్ లోని కచ్ జిల్లా లోని దోర్ దో గ్రామం ఇపుడు వార్తల్లోకెక్కింది. ఎందుకంటే ఆ గ్రామమ్ “అత్యుత్తత పర్యాటక గ్రామం” గా యునైటెడ్ నేషన్స్ వారి వరల్డ్ టూరిజం ఆర్గ నైజేషన్ నుండి అవార్డు ను గెలుచుకుంది. ఇది అంతగా తెలియని అత్యంత సుందర మైన గ్రామం. ఈ గ్రామానికి ఈ అరుదైన గౌరం దక్కడానికి ఈ గ్రామమ్ గ్రామీణ అభివృద్ధి, ప్రర్యాటక రంగం విసరిచడానికి చేసిన కృషి , మరియు సంస్కృతీ పరిరక్షణ లో సాధించిన ప్రగతి కొలమానాలుగా తీసుకున్నారు. ఈ గ్రామం లో ప్రతీ సంవత్సరం రాన్ ఉత్సవం జరుగుతుంది. రాన్ అనేది ఒక సాంస్కృతిక ఉత్సవం . ఇందులో అన్నిరకాల కళా రూపాలు ప్రదర్శిస్తారు. సంగీతమ్, ప్రాచీన కళలు , హస్త కళలు అందులో ప్రధానం గా ఉంటాయి. దోర్ దో కు లభించిన ఈ గుర్తింపు ఈ ప్రాంతం యొక్క ఆర్ధిక, పర్యాటక రంగాలపై ఎంతో ప్రభావాన్ని చూపింది. ఈ రా న్ ఉత్సవ నిర్వహణ వలన ఈ ప్రాంతపు , ఆదాయం , వాణిజ్యం, టూరిజం బాగా పెరిగాయి.
ఈ ప్రాంతం ప్రజలు ఉత్సాహం గా వారి సంస్కృతీ పరిరక్షణ లో పాల్గొనడం , హస్త కల కు లభించే ప్రోత్సాహం, వీరు ఇచ్చే చక్క టి ఆతిధ్యం ఈ ప్రాంతానికి దేశదేశాల నుండి టూరిస్ట్ లు గ వచ్చే వారికి మంచి మరపురాని అభువాన్ని ఇస్తున్నాయి.

రా న్ ఉత్సవం వలన 468 కోట్ల రూపాయలు కేవలం GST రూపం లో వస్తోందంటే దేశ విదేశ యాత్రికుల వలన ఇక్కడ జరిగే వ్యాపారం ఎంతో మీరు ఊహించవచ్చు. గుజరాత్ ప్రభుత్వమే ఈ ఉత్శవం నిర్వహించడానికి కారణం ఈ ప్రాంతానికి ఉన్న ఆదాయ , మరియు పర్యాటక శక్తే కారణం. ప్రధాని కూడా యుఎన్ అవార్డు రావడం పై సోషల్ మీడియా లో సంతోషం వ్యక్తం చేసి అభినందించారు.
దోర్ దో కు లభించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డు వలన మనదేశం లోని మిగిలిన గ్రామాలకు, పల్లెలకు కూడా పర్యాటక రంగ అభివృద్ధి చేసుకెలా ఒక స్ఫూర్తినిస్తుందనడం లో సందేహం లేదు. అంతే గాక ఈ అవార్డు యునైట్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజషన్ వారు ఈ ప్రాంతం లో జరుగు తున్న సంస్కృతి పరిరక్షణకు, పర్యాటకరంగ అభి వృద్ధికి, కళల ప్రోత్సాహానికి ఇచ్చిన అత్యంత గౌరవ ప్రదమైన గుర్తింపు గా భావించాలి.