ట్రెండింగ్ న్యూస్ సినిమా

Alitho Saradaga : ఆలీతో సరదాగా షోలో డైరెక్టర్ అనీల్ రావిపూడి, శ్రీవిష్ణు సందడి

Alitho Saradaga ఆలీతో సరదాగా షోలో డైరెక్టర్ అనీల్ రావిపూడి శ్రీవిష్ణు సందడి
Share

Alitho Saradaga : ఆలీతో సరదాగా Alitho Saradaga షో గురించి తెలుసు కదా. ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ఎంతో మంది వెలుగులోకి రాని సెలబ్రిటీలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలతో ముచ్చటించిన కమెడియన్ ఆలీ.. సినిమాల్లోనే కాదు.. ఇంటర్వ్యూలు చేసి కూడా బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం చాలా కొత్తగా ఉండటం.. వచ్చిన గెస్టులను కాసేపు ఆటపట్టించడం.. వాళ్ల పర్సనల్ విషయాలను ప్రేక్షకులకు తెలిసేలా చేయడంలో సఫలం అయ్యారు.

Director anil ravipudi and sree Vishnu in alitho saradaga
Director anil ravipudi and sree Vishnu in alitho saradaga

ఇప్పటి వరకు చాలామంది సెలబ్రటీలను ఇంటర్వ్యూ చేసిన ఆలీ.. తాజాగా ప్రముఖ డైరెక్టర్ అనీల్ రావిపూడి, హీరో శ్రీవిష్ణును ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి.. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ తో గాలి సంపత్ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈసందర్భంగా ఆలీతో సరదాగా సినిమా షూటింగ్ లో అనీల్ రావిపూడి, శ్రీవిష్ణు మెరిశారు.

Alitho Saradaga : అనీల్ రావిపూడి, శ్రీవిష్ణుతో ఆలీ సందడి

ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ ఈటీవీలో ఎంతో సక్సెస్ ఫుల్ గా ప్రస్తుతం రన్ అవుతోంది. అయితే.. ఈ షోకు ఇప్పటి వరకు చాలామంది గెస్టులు వచ్చారు. తాజాగా వచ్చిన గాలి సంపత్ డైరెక్టర్ అనీల్ రావిపూడి, హీరో శ్రీవిష్ణుతో ఆలీ కాసేపు సరదాగా ముచ్చటించారు. గాలి సంపత్ సినిమా విశేషాలను వాళ్లను అడిగి తెలుసుకున్నారు. అసలు.. గాలి సంపత్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? ఈ సినిమా కోసం ఉపయోగించిన ప్రత్యేక భాష ఏంటి? ఫాపా భాష గురించి.. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఏం మాట్లాడినా.. ఫ…ఫ అనే సౌండ్ వస్తుంది. దాని గురించి.. సినిమా విశేషాల గురించి.. అనీల్ రావిపూడి, శ్రీవిష్ణును అడిగి ఆలీ తెలుసుకుంటారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.

 


Share

Related posts

Immanuel : వామ్మో.. ఇమ్మాన్యుయేల్ లో ఈ కళ కూడా ఉందా? అదరగొట్టేశాడుగా?

Varun G

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. మ్యాటర్ ఏమిటంటే..?

somaraju sharma

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సాయిప‌ల్ల‌వి ‘గార్గి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ram