V.N. Adithya: మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా..?

Share

V.N. Adithya: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హీరోయిన్స్ దేదీప్యమానంగా వెలుగుతారో ఎప్పుడు చిచ్చుబుడ్డిలా ఆవిరైపోతారో చెప్పడం ఎవరివల్లా కాదు. హీరోయిన్స్‌కి సినిమా ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువ అంటుంటారు. చాలామంది విషయంలో ఇది ప్రూవ్ అయింది కూడా. చాలా తక్కుమందే 10 నుంచి 15 ఏళ్ళపాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. క్రేజీ హీరోయిన్స్‌గా మారుతున్నారు. అయితే ఇండస్ట్రీలో ఇలా వచ్చి అలా ఓ నాలుగైదు ఏళ్ళు సినిమాలు చేసి కనుమరుగైన హీరోయిన్స్ మాదిరిగానే దర్శకులు కూడా ఉన్నారు.

do you know block buster director v-n-adithya present situation...?
do you know block buster director v-n-adithya present situation…?

అలాంటి వారి లిస్ట్‌లో వి.ఎన్.ఆదిత్య కూడా ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎం.ఎస్.రాజు నిర్మాతగా మనసంతా నువ్వే సినిమాకి అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ – రీమా సేన్ జంటగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. నిర్మాతకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఆర్.పి.పట్నాయక్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ అయింది. దాంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వి.ఎన్.ఆదిత్య పేరు మార్మోగిపోయింది.

V.N. Adithya: ఆదిత్య స్టార్ డైరెక్టర్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

ఈ సినిమా తర్వాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాతగా మళ్ళీ ఉదయ్ కిరణ్ హీరోగా శ్రీరామ్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇందులో అనిత హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించాడు. మ్యూజికల్‌గా మంచి హిట్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడి సత్తా చూసిన నాగార్జున తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమానే నేనున్నాను. నాగార్జునకి ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆదిత్య స్టార్ డైరెక్టర్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే మనసు మాట వినదు అనే సినిమా తీశాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. అయినా నాగార్జున మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమానే బాస్. నయనతార, పూనం భజ్వా హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటి నుంచి దర్శకుడిగా వి.ఎన్.ఆదిత్యకి కష్టాలు మొదలయ్యాయి. బాస్ సినినా తర్వాత సిద్దార్థ్ – లియానా జంటగా ఆట సినిమాను తీశాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా రెండు సినిమాలు భారీ డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి కెరీర్ మొత్తం రివర్స్ అయింది.

V.N. Adithya: నిర్మాతలు అవకాశం ఇవ్వడం లేదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

ఆ తర్వాత తీసిన రెయిన్‌బో, రాజ్, ముగ్గురు సినిమాలు తీసి అన్నీ ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. దాంతో మళ్ళీ ఇప్పటి వరకు ఈ డైరెక్టర్‌కి సినిమా చేసే అవకాశం దక్కలేదు. 2011 నుంచి దాదాపు పదేళ్ల గ్యాప్ వచ్చినా కూడా ఆదిత్య దర్శకత్వంలో సినిమా రాకపోవడం ఆశ్చర్యకరం. గత ఏడాది ఈయన ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం రాలేదు. అయితే చాలా సందర్భాలలో ఆయన నిర్మాతల కోసం ప్రయత్నించినట్టు ఇండస్ట్రీలో టాక్ ఉంది. కథలు చాలానే ఆయన వద్ద ఉన్నప్పటికి తన గత చిత్రాల ట్రాక్ రికార్డ్ బాగోలేకపోవడంతో నిర్మాతలు అవకాశం ఇవ్వడం లేదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

 


Share

Related posts

‘నన్ను చంపేస్తారు’ అని సుశాంత్ ఎప్పుడూ వాళ్లను చూసి భయపడేవాడు..! అతని చనిపోవడానికి ముందు ఏం జరిగిందంటే….

arun kanna

ఆమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం!

somaraju sharma

Aradya Latest Gallerys

Gallery Desk