Dry fruits డ్రై ఫ్రూట్స్  తో డార్క్ చాక్‌లెట్ ను  ఇలా తయారు చేసుకోండి!!రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి!!

డ్రై ఫ్రూట్స్  తో డార్క్ చాక్‌లెట్ ను  ఇలా తయారు చేసుకోండి!!రుచితో పాటు బోలెడన్ని
Share

Dry fruits:ఇప్పుడు అందరూ కంప్యూటర్ ముందు గంటల పాటు కూర్చొని కష్టపడక తప్పని రోజులు..ఇలా శారీరక శ్రమ లేని పనులు చేస్తుండటంతో అనారోగ్య సమస్యలకు గురి కాక తప్పడం లేదు. దీనివల్ల  స్థూలకాయం , షుగరు , గుండె సంబంధిత వ్యాధులు  వెంటాడుతున్నాయి. హృద్రోగ సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలగాలంటే .. డార్క్ చాక్లెట్ తినడం చాలా  మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియ చేస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి  డార్క్ చాక్లెట్స్ బాగా  ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లో వుండే ఫ్లావనోల్స్ కారణం గా  గుండెకు, మెదడుకు రక్తప్రసరణబాగా జరుగుతుంది. క్యాన్స‌ర్ ముప్పును తగ్గించడం లో కూడా డార్క్ చాక్లెట్ బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు  చాక్లెట్ లో డ్రై  ఫ్రూట్స్  వేసుకుని  ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం

Dry fruits and dark chocolate smoothie
Dry fruits and dark chocolate smoothie

కావాల్సిన పదార్థాలు:
డార్క్‌ చాక్లెట్‌- 500గ్రాములు
డ్రైప్రూట్స్‌- మీ టేస్ట్ ని బట్టి తీసుకోండి
నెయ్యి లేదా వెన్న-100 గ్రాములు
ప్లాస్టిక్‌ చాక్‌లెట్‌ అచ్చులు
వీటి తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
ముందుగా ఒక పాన్‌లో నీళ్ళు పోసి స్టౌపై పెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలో డార్క్‌ చాక్లెట్‌ వేసి పాన్‌లో వేడెక్కిన నీళ్లలో  పెట్టాలి. ఆనీళ్ల వెడీకే చాక్లెట్‌ కరగడం మొదలవుతుంది. చాక్లెట్‌ కరిగే దాకా స్పూన్ తీసుకుని కదుపుతూ ఉండాలి. ఓవెన్‌లోనైతే చాక్లెట్‌ కరగటానికి 1 నిముషం పడుతుంది. ఆ తర్వాత దానిని దింపి స్పూన్‌తో బాగా కలుపుకోవాలి.

కరిగిన తర్వాత కావాలనుకుంటే షుగ‌ర్ కూడా కలుపుకోవచ్చు. ఆ మిశ్రమంలో డ్రైప్రూట్స్‌ చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి బాగా కలుపుకోవాలి. అందులో మనం తీసుకున్న  నెయ్యి లేదా వెన్న కూడా వేసి కలుపుకుంటే,  క్రీం బాగా మృదువుగా వస్తుంది . ఆ మిశ్రమం చల్లారిన తర్వాత ప్టాస్టిక్‌ అచ్చుల్లో పోసి 5 నిముషాల పాటు  డీప్‌ ప్రిజ్‌లో పెట్టి తీస్తే సులువుగా డార్క్ చాక్‌లెట్ రెడీ అయిపోతుంది.

డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉంటాయి. వారానికి మూడు సార్లు డార్క్ చాక్లెట్స్ తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా చేసుకోవచ్చు . క్యాన్సర్స్ నుండి రక్షణ కలగడం  తో పారు వృద్ధాప్య ఛాయలను పోగొడుతుంది.

 


Share

Related posts

KCR : కేసీఆర్‌, జ‌గ‌న్‌… ఈ త‌ప్పును మీరు స‌రిదిద్దాల్సిందే

sridhar

పెద్ద స్కామ్ … చిన్న వార్త… తెలుగు మీడియా కుల రాతలు మారవా ?

Comrade CHE

సెల్ టవర్లను టార్గెట్ చేసుకున్న రైతు ఆందోళనకారులు!పంజాబ్ లో ఫటాఫట్!!

Yandamuri