NewsOrbit
న్యూస్

బంగారం స్మగ్లింగ్ కేసు..! సీఎం కార్యాలయంపై ఈడీ నిఘా..!

 

 

కేరళ రాష్ట్రంలో 30 కేజీల గోల్డ్ స్మగ్గ్లింగ్ కేసు ఎంత సంచలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్ ను అదుపులోకి తీసుకొని ఈడీ విచారిస్తుంది. ఆమె గతంలో కేరళ ప్రభుత్వ ఐటి శాఖలో, సీఎం కార్యాలయాలలో ఉన్నతస్థాయిలో పనిచేస్తు ఉండడంతో ఆమెకు కేరళ ముఖ్యమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శ ఎం.శివశంకరన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పడాయి, దీనితో శివశంకర్ మీద కూడా కేసు కు సంబంధించి ఆరోపణులు రావడంతో అతని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సిఎం  ప్రధాన కార్యదర్శి అరెస్ట్ కావడంతో  పినరయి విజయన్ కార్యాలయాం పైన ఈడీ అధికారులు ద్రుష్టి సారించారు.

 

తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కాన్సులేట్‌కు వస్తున్న పార్సిల్‌లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 5న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్సిల్లో ఇలా భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు.ఈ కేసు లో విచారణ జరుపుతూన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్రాక్ చేయడంతో మరో కొత్త స్కాం బయటపడింది. సిఎం “లైఫ్ మిషన్ ప్రాజెక్టు” వరదలు కారణంగా ఇల్లు కోల్పోయిన వాళ్లకి, భూమిలేని పౌరులకు గృహనిర్మాణ పథకం, ఈ పధకానికి సంబంధించి కొచ్చికి చెందిన యూనిటాక్ బిల్డర్ల దగ్గర నుండి శివశంకరన్ రూ .4 కోట్లు లంచం తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. అరెస్ట్ అయ్యి ఈడీ అదుపులో ఉన్న శివశంకరన్ ను ,ఈ కాంట్రాక్టు కు సంబంధించి ప్రశ్నిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. రూ.60 లక్షల రూపాయలని మాజీ ఐఎఎస్ అధికారి శివశంకరన్ ఎస్బిఐ తిరువనంతపురం శాఖ బ్యాంక్ ఖాతా నుండి రికవరీ చేయడానికి ఇడి ప్రయత్నిస్తుంది.బంగారు కుంభకోణం ప్రధాన నిందితురాలు స్వాప్నా సురేష్ మరియు శివశంకర్ చార్టర్డ్ అకౌంటెంట్ వేణుగోపాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్యాంక్ ఖాతాలో జమ చేసిన చెల్లింపుల్లో భాగంగా ఈ భారీ నగదు ఉందని ఆరోపించారు.

లైఫ్ మిషన్ కింద యూనిటాక్ బిల్డర్స్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న రోజున, వాట్సాప్ ద్వారా శివశంకర్ మరియు స్వాప్నా సురేష్ మధ్య సందేశాలు మార్పిడి చేయబడ్డాయి, బంగారు అక్రమ రవాణా నిందితులపై దర్యాప్తులో భాగంగా, లంచం కేసులో సిఎం కార్యాలయానికి ప్రమేయం ఉందని ఆరోపించిన ఈడి, సాక్ష్యాలను సేకరించింది. శివశంకర్ ప్రమేయం ఉన్న కేరళ ప్రభుత్వంలోని ఇతర ప్రధాన పథకాలను కూడా ఈడి అధికారులు  దర్యాప్తు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిధుల విషయంలో యుఎఇ యొక్క రెడ్ క్రెసెంట్ ప్రమేయం గురించి ఏజెన్సీ పరిశీలిస్తోంది. ఇంతలో, విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక బ్యూరో వడక్కంచరీ లైఫ్ మిషన్ ప్రాజెక్ట్ కేసులో శివశంకర్‌ను ఐదవ నిందితుడిగా ఎఫ్ఐర్ దాఖలు చేసింది. ఇందులో అనేక అవకతవకలు జరిగాయని, ప్రధాన బంగారు స్మగ్లింగ్ నిందితులు – స్వప్నా సురేష్, పిఎస్ సరిత్, సందీప్ నాయర్ కూడా ఈ కేసులో నిందితులే అన్ని అవినీతి నిరోధక బ్యూరో తెలిపింది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju