NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nellore Politics: కరోనా వేళ కూడా నెల్లూరు జిల్లాలో టిడిపి వైసిపిల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు!మంత్రి అనిల్ వెంటబడ్డ కోటంరెడ్డి!!

Nellore Politics: కరోనా వీర విహారం చేస్తున్న తరుణంలో కూడా రాజకీయ చైతన్యానికి మారుపేరైన నెల్లూరు జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు సాగుతున్నాయి. ఆ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని టార్గెట్ గా చేసుకుని నెల్లూరు సిటీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనేక అవినీతి ఆరోపణలు చేశారు.

Even in Corona, there are challenges between TDP and YCP in Nellore district
Even in Corona there are challenges between TDP and YCP in Nellore district

ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల వద్ద నుండి కమీషన్లు తీసుకుంటూ మంత్రి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నాడని శ్రీనివాసులు రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.ఎక్కడ వీలైతే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ అవినీతికి పాల్పడుతున్నాడని,ఈ విషయమై తాను కాణిపాకం లేదా షిర్డీ లో ప్రమాణం చేస్తానని మంత్రికి దమ్ముంటే అక్కడికొచ్చి తాను నీతిమంతుడినని ప్రమాణం చేయాలని శ్రీనివాసులు రెడ్డి సవాల్ విసిరారు.ఏ రోజున ప్రమాణానికి వచ్చేది నిర్ణయించుకునే ఛాయిస్ ను మంత్రికే ఆయన వదిలేశారు.

Nellore Politics: మంత్రి అవసరం లేదు.. నేను చాలు!

ఈ దశలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తరపున వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ వకాల్తా పుచ్చుకున్నారు.నిజానికి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కి మించిన అవినీతిపరుడు ఇంకొకరు లేరని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉండగా ఆయన ప్రతి లేఅవుట్ అప్రూవల్ కి కమీషన్ తీసుకున్నారని బుధవారం మీడియా సమావేశంలో ప్రత్యారోపణలుచేశారు.కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి బెట్టింగ్ రాజా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని..నీతి నిజాయితీలతో మంత్రిపదవిని నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. కోటంరెడ్డి స్థాయికి మంత్రి రావాల్సిన అవసరం లేదని ,మంత్రి తరపున తాను ఎక్కడికన్నా వచ్చి ఈ విషయమై ప్రమాణం చేస్తానని ఇందుకు శ్రీనివాసులరెడ్డి సిద్ధమేనా అని రూప్ కుమార్ యాదవ్ ప్రతి సవాల్ విసిరారు.

మంత్రే రావాలి.. డూపులు వస్తే నేను రాను!

అయితే రూప్ కుమార్ యాదవ్ ఆఫర్ ను కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తిరస్కరించారు.తాను డిమాండ్ చేసినట్లుగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణానికి రావాలని, డూపులు వస్తే తాను రాబోనని ఆయన తేల్చి చెప్పారు.రూప్ కుమార్ యాదవ్ తనకు పూచికపుల్లతో సమానమని అతను ప్రమాణానికి కు వచ్చేదేమిటని శ్రీనివాసులురెడ్డి తేలిగ్గా తీసిపారేశారు.ఇవాళ కాకపోతే రేపు లేదా వారానికి అయినాసరే తను నిజాయితీ పరుడైతే మంత్రే ప్రమాణం చెయ్యడానికి రావాలని మరోసారి కోటంరెడ్డి ఆహ్వానించారు.ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju