Heroine Kajal Agarwal: “ఆ అందం ఇక అందదు.. ఆ కన్నెతీగ ఇక కానరాదు.. ఆ సన్నతీగ ఇక సందడి చేయదు.. ఆ నాజూకు భామ ఇక నటించదు.. ఆ చందమామ ఇక వేడెక్కించదు..!” ఎస్ ఈ ఒక్కమాటతో ఆమె ఎవరో అర్ధమయ్యే ఉంటుంది. చందమామ రూపుతో వేడెక్కించే కాజల్ సినిమాలకు దూరం కాబోతుంది. ఆమె అభిమానులకు.., ఈ వార్త కాస్త బాధనిపించేదే. కానీ హీరోయిన్లు ఎల్లకాలం కాలం వెళ్లదీయలేరు. అందం ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేసి, వెనకేసుకోవాలి.. తర్వాత పెళ్లి చేసుకుని చెక్కేయాలి. ఆ పై కొన్నేళ్ళకు ఆంటీలయ్యాక మళ్ళీ రెండో ఇన్నింగ్స్ ఆరంభించాలి. ఇదే కదా అందరూ పాటిస్తున్న సాంప్రదాయం. అందుకే కాజల్ కూడా అదే చేయనుంది. గత ఏడాది గౌతమ్ కిచులు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్న కాజల్ ప్రస్తుతం అతనితో జాలీగా గడుపుతోంది. భర్త కోరిక మేరకు ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ చెప్పేందుకు సిద్ధమవుతోంది..!
Heroine Kajal Agarwal: చివరి సినిమాలు ఆ రెండే..!?
ప్రస్తుతం కాజల్ రెండు సినిమాల్లో నటిస్తుంది. చిరంజీవి – కొరటాల కాంబినేషన్ లో వస్తున్న “ఆచార్య”లో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తున్న మరో సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ రెండు అయ్యాక ఇక ఆపేయడానికి నిర్ణయం తీసుకుంది. అందుకే తాజాగా బాలయ్య సినిమాలోనూ.., మరో రెండు చిత్రాల్లో నటించాలని నిర్మాతలు సంప్రదించినా నో చెప్పేసిందట..! సో.. టాలీవుడ్ చందమామని మిస్ అవుతున్నట్టే.. మరో చందమామ వచ్చే వరకు.. కాజల్ తెలుగు సినీ ప్రయాణం చూస్తే 2007 లో తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన “లక్ష్మి కళ్యాణం” సినిమాతో ఆమె తెలుగు సినీ హీరోయిన్ గా పరిచయమయ్యారు. అదే ఏడాది వచ్చిన చందమామతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ 2009 లో వచ్చిన “మగధీర” తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయారు. ఇక తిరిగి చూసే పని లేకుండా దాదాపు 60 సినిమాలు చేశారు.