NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Famous fashion Designer Prathyusha Suicide: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య .. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

Famous fashion Designer Prathyusha Suicide in Hyderabad

Famous fashion Designer Prathyusha Suicide: హైదరాబాద్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఆమె మృతి చెందింది. బాత్ రూమ్ లో ప్రత్యూష మృత దేహం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రత్యూష బెడ్ రూమ్ లో కార్బన్ మోక్సైడ్ బాటిల్ ఉండటంతో ఆమె దాన్ని పీల్చి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Famous fashion Designer Prathyusha Suicide in Hyderabad
Famous fashion Designer Prathyusha Suicide in Hyderabad

Famous fashion Designer Prathyusha Suicide: కోరుకున్న జీవితం ఇది కాదు

అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ప్రత్యూష హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. 30 ఏళ్ల ప్రత్యూష హైదరాబాద్ లో ఒంటరిగానే జీవనం సాగిస్తొంది. పదేళ్లుగా టాలివుడ్, బాలివుడ్, ప్రముఖుల కోసం దుస్తులు డిజైన్ చేస్తున్నారు. ఇండియాలోనే ప్రముఖ డిజైనర్ గా ప్రత్యూష పేరు తెచ్చుకున్నారు. ప్రత్యూష మృతిపై ఢిల్లీలోని ఆమె పేరెంట్స్ కు పోలీసులు సమాచారం అందించారు. రెండు రోజులుగా ప్రత్యష ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రెసిడెన్సీ వాచ్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి పరిశీలించగా బాత్ రూమ్ లో ఆమె మృతదేహం ఉంది. బెడ్ రూమ్ లో పోలీసులు తనిఖీ చేయగా కార్బన్ మోనాక్సైడ్ తో పాటు సూసైడ్ నోట్ లభించింది. ఈ సూసైడ్ నోట్ లో తాను ఎవరికీ భారం కాదల్చుకోలేదని, తాను కోరుకున్న జీవితం ఇది కాదని ప్రత్యూష పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju