జూరాల నీటి రభస

Share

మహబూబ్‌నగర్, జనవరి6: నీటి విడుదల విషయంలో రైతులకూ అధికారులకూ మధ్య ఘర్షణ తలెత్తడంతో జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆదివారం ఉద్రికత్త  వాతవరణం చోటుచేసుకున్నది. రబీ పంట కోసంఎడమ కాలువకు అధికారులు నీరు విడుదల చేయడానికి ప్రయత్నించినపుడు గొడవ మొదలయింది. మహబూబ్‌నగర్‌ రైతులకు నీరు వదలకుండా వనపర్తి, కొల్లాపూర్‌ ప్రాంతాలకు నీరు తరలించడాన్ని నిరసిస్తూ రైతులు జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. జూరాల ఎడమ కాలువకు నీటి విడుదలను రైతులు అడ్డుకున్నారు. అధికారులు పోలీసుల సహాకారంతో ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. అధికారుల తీరుకు నిరసనగా రైతులు ప్రాజెక్ట్ వద్ద బైఠాయించి ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడ నుండి వెళ్ళి పోగానే రైతులు ఎడమ కాలువలో నీరు వెళ్లకుండా నిలిపి వేశారు.


Share

Related posts

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అంతా ఫేక్… నిమ్మగడ్డ సీరియస్

Vihari

నాగబాబు అస్సలు ఆగట్లేదుగా.. ఖుషీ ఖుషీగా రెండో సీజన్ కూడా అనౌన్స్ చేశాడు?

Varun G

బిగ్ బాస్ 4 : ఈ సారి టైటిల్ నాదే అంటున్న అఖిల్..! తాను పెద్ద మూర్ఖుడు అని అనేశాడు…

arun kanna

Leave a Comment