చీరాల మత్స్యకారుల మధ్య మంటలు! రణరంగంగా మారిన వాడరేవు!!

Share

చీరాల మండలం వాడరేవు రణరంగంగా మారింది. వేటపాలెం మండలం కఠారి పాలెం జాలర్లు దాడి చెయ్యడంవేటపాలెం మండలం తో దాదాపు పది మంది వాడరేవు మత్స్యకారులు గాయపడ్డారు.బల్ల వల,ఐలవల వివాదం ముదిరిపోయి పరిస్థితి ఇంతవరకు వచ్చింది.

వాడరేవు మత్స్యకారులు బల్ల వలను వాడుతుండగా కఠారి పాలెం జాలర్లు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.చాలాకాలంగా ఈ విషయమై వివాదం రగులుతోంది.అయితే శుక్రవారం ఇది క్లైమాక్స్కు చేరింది.ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి విలేకరులకూ గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే …. చీరాల నియోజకవర్గం పరిధిలోని కఠారి పాలెం వాడరేవు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య సముద్రంలో చేపలు పట్టే విషయంలో గత కొన్ని రోజుల నుండి గొడవలు జరుగుతున్నాయి.వలల వాడకం విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి.ప్రభుత్వ అనుమతి మేరకు వాడరేవు మత్స్యకారులు బల్ల వల నువాడుతున్నారు.అయితే ఆ వల వాడకం వల్ల చేపలతోపాటు గుడ్లు కూడా బయటకొచ్చి మత్స్యసంపద నశించిబోతోందన్నది కటారి పాలెం జాలర్ల వాదన.

ఐలవల వాడాలని వారు కోరుతుండగా వాడరేవు మత్స్యకారులు అంగీకరించడం లేదు.ఈ నేపథ్యంలో ఇరు గ్రామాల మత్స్యకారులు పరస్పరం పడవలను వలలను అపహరించుకున్న సంఘటనలు జరిగాయి.ఈ వివాద పరిష్కారానికి అధికార యంత్రాంగం పది రోజుల క్రితం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏకాభిప్రాయం కుదరక అది వాయిదా పడింది.అధికారులే కాకుండా చీరాల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ కూడా ఇరుగ్రామాల మత్స్యకారుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నించారు.సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, చీరాల రూరల్ సిఐ, వేటపాలెం ,ఈపురుపాలెం ఎస్సైలు కఠారి పాలెం గ్రామంలో సముద్రపు ఒడ్డున ఇరు గ్రామస్థులతో శుక్రవారం ఉదయం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి వాడరేవు గ్రామస్తులు హాజరుకాకుండా సముద్రంలో వేటకు వెళ్ళారు.

అధికారులు వచ్చినా వాడరేవు గ్రామస్తులు ఎందుకు రాలేదని అక్కడకు వచ్చిన అధికారులను నిలదీసిన కటారి పాలెం మత్స్యకారులు ఇప్పుడే వారిని తీసుకొస్తాము అంటూ పోలీసులు చెప్పినా వినకుండా సముద్రం లోనికి వెళ్లి వాడరేవు గ్రామమునకు చెందిన సుమారు పది మందిని, వారి వలలను తీసుకొని వచ్చి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. అధికారులు వారిని విడిచిపెట్టాలని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఆవిషయం తెలిసిన వాడరేవు గ్రామస్తులు సముద్రంలోకివెళ్లి కటారివారి పాలెం గ్రామానికి చెందిన పది మందిని వారి బోట్లు మరియు వలలతో సహా ఓడరేవుకు తీసుకువచ్చి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ విషయం తెలిసిన కటారిపాలెం, రామాపురం మత్స్యకారులు వాడరేవు గ్రామంపై మూకుమ్మడిగా దాడి చేశారు. గాయపడిన వారిలో వాడరేవు మాజీ సర్పంచ్ రమణ, మత్స్యకార పెద్దలు, పలువురు గ్రామస్తులు, విలేకరులు ఉన్నారు. ఈ సంఘటనతో తీరప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 


Share

Related posts

Job update: ఐటిఐ లిమిటెడ్ లో ఖాళీలు..!!

bharani jella

Telangana : ఆ విషయంలో తెలంగాణ యువతను మోసం చేశారంటూ కేసిఆర్ పై నిప్పులు చెరిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!

sekhar

Prabhas : ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ టైటిల్ అదే ఫిక్స్ చేశారా..!

GRK