పసిడి పై పెట్టుబడులు పెడుతున్నారా ! ఇది తెలుసుకోండి.

 

 

పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయి అని ఎదురుచుస్తున్నారా….అయితే మీరు ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. అదేంటి బంగారం ఏంటి ధర తగ్గడం ఏంటి అంటారా… నిజంగా బంగారం ధర తగ్గుతుంది. కొద్ది రోజుల క్రిందట వరకు 50 వేలకు పై చిలుకే బంగారం ధర పలికింది. అదుపు లేకుండా పెరిగిన పుత్తడి కి కాస్త బ్రేక్ పడిందా అంటే.. ప్రస్తుతానికి అవుననే చెప్పాలి.

ఒకానొక సమయంలో బంగారం కొనుగోలు దారులకు ఒక్క రోజే  1800 రూపాయలు పెరిగి గట్టి షాక్ నిచ్చింది.  పై పై కి ఎగబాకిన బంగారం ధర దిగి రావడంతో.. ఇప్పుడు బంగారం పై పెట్టుబడులు పెట్టె వారికి ఇదే సరైన సమయం అని అందరూ బావిస్తున్నారు.  భారత్ లో బంగారం పై పెట్టుబడులు ఎక్కువగానే ఉంటాయి. ఆభరణాలపై కంటే బంగారం పై గడిచిన కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడులు పెరిగాయి.  గడిచిన నెలలలో బంగారం ధరతో పోలిస్తే.. ప్రస్తుతం ఉన్న ధర భారీగా తగ్గనట్లే. 56 వేల ను తాకిన పసిడి గత వారం రోజులుగా తగ్గుతూ వస్తుంది. ఇది బంగారం కోనుగోలు దారులకు శుభపరిణామం.

భారత్ లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 4,816 రూపాయలు కాగా 24 క్యారెట్ల  గ్రాము ధర 5,253రూపాయలుగా గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పసిడి ధర కాస్త పెరిగినా.. పది రోజుల క్రితంతో పోల్చుకుంటే ధర భారీగానే  తగ్గింది. బంగారంతో పాటు అంతటి ప్రాముఖ్యం గలది వెండి. అది కూడా గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తుంది. గత పది రోజులతో పోల్చుకుంటే వెండి గ్రాముకు 70 రూపాయల వరకు తగ్గింది.