న్యూస్

SSMB 28: మంచి స్పీడ్ మీద ఉన్న మహేష్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

Share

SSMB 28: “SSMB 28” అనే వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎప్పుడో  ప్రారంభం కావలసి ఉండగా ఈనెల 12వ తారీకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. వాస్తవానికి సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఏప్రిల్ నెలలో జరిగాయి. దీంతో “సర్కారు వారి పాట” రిలీజ్ అయిన వెంటనే జూన్ నెలలో ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. ఆగస్టు నెలలో మహేష్ పుట్టినరోజు నాడు సినిమా ఫస్ట్ లుక్ లేదా వీడియో వచ్చే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు.

Good news for the fans of Mahesh Trivikram who is on good speed
SSMB 28

కానీ అనూహ్యంగా మహేష్ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లడంతో పాటు త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయటంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ కావలసి వచ్చింది. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 12వ తారీకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ విజయవంతంగా కంప్లీట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాలోని హై ఆక్టెన్ ఎపిక్ యాక్షన్స్ సన్నివేశాలను.. స్టంట్ కొరియోగ్రాఫర్ లు అన్బు, ఆరివు పర్యవేక్షణలో షూట్ జరిగినట్లు సినిమా యూనిట్ తెలిపింది.

Good news for the fans of Mahesh Trivikram who is on good speed
SSMB 28

రెండవ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ హెగ్డే.. మహేష్ బాబు జాయిన్ కానున్నట్లు దసరా తర్వాత స్టార్ట్ కానున్నట్లు తెలిపారు. దీంతో కచ్చితంగా వచ్చే దసరా పండుగ నాడు సినిమాకి సంబంధించి పోస్టర్ లేదా టైటిల్ విడుదల చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు కూడా నటనపరంగా మహేష్ లో కొత్తకోనాన్ని చూపించాయి. మరి ఈ మూడో సినిమాతో మహేష్ నీ త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

ఎఫ్ 3 ని రవితేజ రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా ..?

GRK

ప్రభాస్ కు ప్రైవేట్ ఫ్లైట్ ఉందని మీకు తెలుసా?

Teja

ATM: అదిరిపోయే వార్తః ఏటీఎంలో డ‌బ్బులు లేక‌పోతే బ్యాంకుకు 10,000 ఫైన్‌

sridhar