Guppedentha manasu Jan 15 today episode: రిషి కాలర్ పట్టుకున్న జగతి…. మరోపక్క గౌతమ్ కు లవ్ హార్ట్ ఇవ్వనున్న వసుధారా..?

Guppedentha manasu Jan 15 today episode
Share

Guppedentha manasu Jan 15 today episode: గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళుతుంది.నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్, వసు ఇద్దరూ కలిసి మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లొకేషన్ చూడటానికి తీసుకుని వెళ్లి లొకేషన్ చుసిన తరవాత రిషికి దారిలో ఆకలి వేయడంతో.. టీ, బన్ కొనుక్కుని, తినే సీన్ నడుస్తుంది.ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో కంటిన్యూ అవుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వసు ప్రేమలేఖ విషయం ఎత్తి ‘సార్.. ఆ ప్రేమలేఖ నా జీవితంలో మొదటిసారి వచ్చింది.. మీరు నాకు ఇష్టం, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అనే మాటలు మొదటిసారి విన్నప్పుడు ఆ మనిషిని చూడాలనే అనిపిస్తుంది కదా.. అందుకే ఆ వ్యక్తి ఎవరో చూడాలని ఉంది సార్’ అంటూ సిగ్గుపడుతుంది. చూద్దాం చూద్దాంలే అనేసి ఇద్దరూ కలిసి కాలేజ్‌కి బయలుదేరతారు.

Guppedentha manasu Jan 15 today episode: ప్రేమ లేఖ విషయంలో రిషిని కాలర్ పట్టుకున్న జగతి:

Guppedentha manasu Jan 15 today episode

సీన్ కట్ చేస్తే కాలేజ్ లో జగతి, మహేంద్రలు ఇద్దరూ కూడా ‘ప్రేమ లేఖ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.ఎలాగయినా వాడ్ని పట్టుకోవాలని జగతి అంటుంటే పోనిలే వదిలేయ్ అని మహేంద్ర అంటుంటే ఈలోపు వసు, రిషిలు వాళ్ల దగ్గరకు వెళ్తారు. ఇంతలో గౌతమ్ కూడా అక్కడికే వస్తాడు.జగతి కోపంగా.. ‘సార్ ఇది మనకాలేజ్ గౌరవ మర్యాదలకు సంబంధించింది సార్. ప్రేమలేఖ ఇచ్చిన వాడు నాకు దొరికితే కాలర్ పట్టుకుని..’ అంటూ రగిలిపోతుంది. దాంతో రిషి ఒక్కసారిగా షాక్ అయ్యి నిజంగానే జగతి తన కాలర్ పట్టుకుని నిలదీస్తున్నట్లు ఊహించుకుంటాడు.ఇంతలో వసు.. ‘మేడమ్ ఆ విషయాన్ని వదిలేయడం.. దాని గురించి రిషి సార్ చూస్తారు అంటుంది వసు. వెంటనే ‘సరే మేడమ్.. నేను చూస్తాను’అంటూ మాట ఇవ్వబోతుంటే.. పక్కనుంచి గౌతమ్ నిజం చెప్పేద్దాం రా.. ఇక్కడే మేటర్ తెగిపోతుంది..’ అంటాడు.నువ్వు నోరుముయ్’ అంటూ తిట్టి అక్కడనుంచి గౌతమ్‌ని పక్కకు తీసుకుని వెళ్లి.. ‘నీ వల్లే నాకు ఈ పరిస్థితి’ అంటూ తిడతాడు.

Guppedentha manasu Jan 15 today episode: రెస్టారెంట్ లో గౌతమ్ వసునూ ఏమి అడిగాడో తెలుసా.?

Guppedentha manasu Jan 15 today episode

ఇక మరోవైపు రెస్టారెంట్‌లో వసు డ్యూటీ టైమ్‌కి గౌతమ్ అక్కడికి వెళ్లిపోతాడు. వసుతో మాట్లాడుతూ ఉండగా సార్ అని చెప్పి వేరే కస్టమర్ దగ్గరకు వెళ్తుంది. ఈలోపు రిషి వచ్చి గౌతమ్‌కి ఎదురుగా కూర్చుంటాడు. ‘ఏంట్రా విలన్ ఫ్రెండ్ ఇక్కడికి కూడా వచ్చేశావా?’ అని తిట్టుకుంటూ ఉంటాడు ఈలోపు వసు వచ్చి సార్ ‘ఏం కావాలి అంటుంది. దాంతో రిషి ఒక కాఫీ అంటాడు. గౌతమ్ మాత్రం..‘కాఫీ విత్ హార్ట్ కావాలి అంటాడు.ఉందో లేదు చూసి చెబుతాను సార్’అని లోపలికి వెళ్తుంది. ఇంకా మన ఈగో మాస్టర్ మనసులో ‘నా ముందు వసుధర వీడికి లవ్ హార్ట్ ఇవ్వడం ఏంటీ అది ఉండకూడదు’ అని అనుకుంటాడు.అయితే వసు కాఫీ తీసుకుని వస్తు ఉంటుంది.చూడరా విలన్ ఫ్రెండ్డూ.. వసుధర నాకు హార్ట్ తెస్తోంది, చూడు అంటూ రిషిని రెచ్చకోడతాడు.

వసు గౌతమ్ కు లవ్ హార్ట్ ఇస్తుందా..?

Guppedentha manasu Jan 15 today episode

కానీ వసు మాత్రం తెచ్చిన కాఫీ రిషికి ఇచ్చి. మీరు అడిగిన కాఫీ ఉంది సార్.. తయారు చేస్తున్నారు.. తెస్తాను’ అని లోపలికి వెళ్లిపోతుంది.మళ్ళీ వసు తెస్తాను అనేసరికి రిషి మనసులో ఆందోళన పడతాడు.అప్పుడే వసు గౌతమ్ అడిగిన హార్ట్ కాఫీని తెస్తూ ఉంటుంది. అది చూసి రిషి మనసులో ‘వద్దు వసుధరా వెనక్కి వెళ్లిపో.. ప్లీజ్’అని అనుకుంటూ ఉంటాడు.గౌతమ్ ఆనందపడతాడు.వసు గౌతమ్ దగ్గర దాకా వచ్చి ఇంతలో ‘నానీ ఇలారా.. ఇది తీసుకుని వెళ్లి ఆ సార్ వాళ్ల దగ్గర పెట్టు అని మరో కస్టమర్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్లిపోతుంది వసు. దాంతో రిషి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. పాపం గౌతమ్ బిక్క మొహం పెడతాడు. ఇక రిషి మాత్రం రేయ్ ఫ్రెండూ.. వస్తోందిరా నీ హార్టు.. అంటూ కామెడీ చేస్తూ ఆటపట్టిస్తాడు.రెస్టారెంట్ సీన్ మాత్రం చూడడానికి భలే ఫన్నీగా ఉంటుంది. ఇక్కడితో ఈరోజు. ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

మాల్దీవుల్లో అల్పపీడన ద్రోణి

Siva Prasad

Pawan Kalyan: దయచేసి నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు అంటున్న హీరో..!!

sekhar

Oats: డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు ఇవి గుప్పెడు తింటే చాలు..!!

bharani jella