RRR: ఆర్ఆర్ఆర్..జనవరి మొదలయ్యేవరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి కొన్న వందల కోట్ల కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాయి. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి దర్శక ధీరుడు రాజమౌళి వంటి వారితో సినిమా అంటే అభిమానుల్లో మాత్రమే కాదు ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత మరో లెవల్. ఇక పాన్ ఇండియన్ స్థాయిలో హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారంటే అన్నీ భాషలలో ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో చెప్పడం చాలా కష్టం.
అలాంటి సినిమా మూడుసార్లు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని ఆశపడిన వేళ అనూహ్యంగా పోస్ట్‌పోన్ అయింది. అలాగే నాలుగోసారి కరోనా థర్డ్ వేవ్ పోస్ట్‌పోన్ చేసింది. దీంతో అభిమానులు మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలీదు గాని, రికార్డ్స్ మాత్రం క్రియేట్ చేస్తూనే ఉంది. అదే అటు నందమూరి అభిమానులకు, ఇటు మెగా అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
RRR: టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ ట్రైలర్‌గా రికార్డులు..
ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. రాజమౌళి ఈ మూవీ ట్రైలర్‌ను 3 నిమిషాలకు పైగా కట్ చేసిన సంగతి తెల్సిందే. అన్నీ భాషలలో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రతీ ఒక్కరు ట్రైలర్ చూసి మరోసారి రాజమౌళి బాహుబలి సినిమాను మించి ప్రపంచ వ్యాప్తంగా కొత్త చరిత్ర సృష్టించనున్నారని చెప్పుకున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ తాజాగా 50 మిలియన్ వ్యూస్ రాబట్టి టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ ట్రైలర్‌గా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.