Chiranjeevi: చిరంజీవిపై పొలిటికల్ మిస్సైల్.. మిస్ ఫైర్..!

Share

Chiranjeevi: చిరంజీవి సాధించిన మెగాస్టార్ ఇమేజ్, తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాలు చేసినా ప్రేక్షకులు పట్టిన నీరాజనాలను చూడకుండా.. ఇంకా కొందరు ఆయన్ను రాజకీయ కోణంలోనే చూడటం విచిత్రం. ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కి ఏర్పడిన అంతరాన్ని పూడ్చేందుకు ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి కూడా ఉన్నారు. ఈక్రమంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఇటివల ఆయన తాడేపల్లిలో సీఎంను కలిశారు. ఆ తర్వాత చర్చల సారాంశాన్ని మీడియాకు చెప్పారు. అయితే.. ఇవన్నీ పక్కకెళ్లిపోయి ఆయనకు వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందనే వార్తలు హైలైట్ అయిపోయాయి. దీంతో చిరంజీవి స్వయంగా, సెటైరికల్ గా #GiveNewsNotViews అనే వివరణ ఇచ్చి మరింత హైలైట్ చేశారు.

political missile on chiranjeevi

రాజకీయంగా ఇంకెంత కాలం..

కొందరు (Chiranjeevi) చిరంజీవిని ఇంకా రాజకీయ కోణంలో చూసేందుకు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు..? పవన్ కు ఆయనకు దూరం పెంచేందుకు చీకట్లో రాయి వేశారా..? మెగా అభిమానుల్లో గందరగోళం సృష్టించేందుకా..? అనేది వారికే తెలియాలి. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ దరి చేరలేదు. 2019 ఎన్నికల్లో జనసేనకు ప్రచారం చేయలేదు. పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నా.. ఆయనపై పొలిటికల్ ఇంపాక్ట్ వేస్తున్నారు. ఈక్రమంలో వచ్చిన రాజ్యసభ సీటు వార్తలను చిరంజీవి ధీటుగా తిప్పికొట్టారు. హీరో విజయ్ దేవరకొండ ఆయనకు సపోర్ట్ చేయడం.. వ్యతిరేక ప్రచారంపై ఎంత విసుగెత్తున్నారో చెప్తున్నాయి. ఇటివలే ఆయన సినీ రాజకీయాలే తట్టుకోలేక.. ‘ఇండస్ట్రీ పెద్దను కాను.. బిడ్డను’ అనడం పరిస్థితికి అద్దం పడుతోంది.

పరిశ్రమ నుంచీ ఇంతేనా..

సీఎం జగన్ ను (Chiranjeevi) చిరంజీవి కలవడంపై పరిశ్రమలో వ్యతిరేకించిన వారూ ఉన్నారు. సీఎం ఆహ్వానిస్తే.. ‘నేను కాదు.. మరికొందరితో కలిసి వస్తాను’ అని ఎలా అనగలరు. చర్చల ఫలప్రదం కావడం ముఖ్యమా.. అందరూ కలిసి వెళ్లడం ముఖ్యమా అనేది వాళ్లకే తెలియాలి. సీఎం పిలిచినా ఏదో వంక పెడితే.. అప్పుడూ చిరంజీవి పైనే విమర్శలు వస్తాయి. సినీరంగ సమస్యలపై ముందడుగు వేసినా కామెంట్లు చేయడం పరిశ్రమలో యూనిటీని తెలియజేస్తోంది. అసలే.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉన్న ఇండస్ట్రీ తరపున చిరంజీవి ముందడుగు వేయడం పరిశ్రమకు మేలు చేసేదే.  గత అనుభవాల దృష్ట్యా తనపై ఇంటా బయటా వస్తున్న విమర్శలను చిరంజీవి నేర్పుగా తిప్పికొట్టడం మెగా హైలైట్.

 

 

 


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

40 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago