న్యూస్ సినిమా

Hansika mothvani : హన్సిక మొత్వానీ సింగిల్ రోల్‌లో ప్రయోగాత్మక చిత్రం..హిట్ ఇచ్చేనా..

Share

Hansika mothvani : టాలీవుడ్ లో దేశ ముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బబ్లీ హీరోయిన్ హన్సిక మొత్వానీ. మొదటి సినిమానే అల్లు అర్జున్ – పూరి జగన్నాథ్ లాంటి స్టార్స్ తో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దాంతో టాలీవుడ్ లో వరుసగా క్రేజీ మూవీస్ లో నటించే అవకాశం అందుకుంది. స్టార్ హీరోయిన్ గా తెలుగులో ఒక వెలుగు వెలిగింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హన్సిక ఆప్ క సురూర్ సినిమాతో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ అందుకుంది.ఇలా తెలుగు, హిందీ భాషలలో క్రేజీ హీరోయిన్ గా మారిన ఈమె ఆ తర్వాత కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ స్టేటస్ అందుకుంది.

hansika-mothvani-single role in experimental movie
hansika-mothvani-single role in experimental movie

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, హిందీ సినిమాలకంటే ఎక్కువగా తమిళ సినిమాలలోనే నటిస్తూ సూపర్ ఫాంలో ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇదొక ప్రయోగాత్మకమైన చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. హన్సికకి అ గట్స్ ఉన్నాయని ఈ చిత్రంతో నిరూపించింది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఈ సినిమా రానుండగా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ సాగుతోంది. రాజు దుస్స దర్శకత్వంలో
రూపొందుతున్న సినిమా 105 మినిట్స్ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది.

Hansika mothvani : ఒకే ఒక్క పాత్ర.. సింగిల్ టేక్.. నో ఎడిటింగ్ అనే సరికొత్త పద్దతిలో రూపొందుతోంది.

కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఒక విల్లాలో మొదలై శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా ప్రయోగాత్మకంగా సింగిల్ షాట్ లో, సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రాలేదు. ఇలాంటి సినిమాను హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇక ఎడిటింగ్ అనేదే లేకుండా సింగిల్ షాట్ లోనే 105 మినిట్స్ సినిమాను కంప్లీట్ చేయనున్నారు. నూతన నిర్మాణ సంస్థ రుద్రాన్స్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ మూవీ ఒకే ఒక్క పాత్ర.. సింగిల్ టేక్.. నో ఎడిటింగ్ అనే సరికొత్త పద్దతిలో రూపొందుతోంది.

 


Share

Related posts

Breaking: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం – అయిదుగురు మృతి

somaraju sharma

Siddhu: పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ కి కీలక బాధ్యతలు అప్పజెప్పిన కాంగ్రెస్ హైకమాండ్..!!

sekhar

తొలి మళయాల వీడియో సాంగ్‌కు అరుదైన రికార్డు

somaraju sharma