సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్..!!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో గెలవటానికి ప్రధాన పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. ఎవరికివారు గ్రేటర్ ఎన్నికల హామీలు భారీ స్థాయిలో ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలలో మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ కి వస్తే మెట్రో ప్రయాణం ఉచితమని హామీ ఇచ్చింది. ఈ స్థాయిలోనే బిజెపి కూడా హామీలు ఇస్తుంది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బిజెపి గ్రేటర్ ఎన్నికల ను చాలా సీరియస్ గా తీసుకుంది.

దుబ్బాక ఉపఎన్నిక హీట్ .. బస్టాండ్‌కు రమ్మన్న బండి సంజయ్‌ పత్తాలేడన్న హరీష్  రావు | Dubbaka bypolls Heat .. Harish Rao targets Bandi Sanjay - Telugu  Oneindiaఒక్క తెలంగాణ బిజెపి నాయకులు మాత్రమే కాక ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలు మరియు కొంతమంది ముఖ్యనేతలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యర్థులపై మాటల తూటాలు భారీ స్థాయిలో పెంచుతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, ఆ ప్రాంతంలో ఉన్న రోహింగ్యాలను పాకిస్తానీ లను తరిమేస్తాం అంటూ కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు.

 

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బండి సంజయ్ చేసిన మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో కౌంటర్ వేశారు. నిజంగా బీజేపీకి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని అంత ఉబలాటంగా ఉంటే పేదరికంపై చేయాలని పిలుపునిచ్చారు. పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా భారత్లో అది అంతర్భాగమే కదా అంటూ ప్రశ్నిస్తూనే… నిజంగా బిజెపి కి దమ్ముంటే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని సవాల్ విసిరారు.