న్యూస్ సినిమా

బాలకృష్ణకు చెల్లి అనగానే బోరున ఏడ్చేసిన హీరోయిన్ లయ.. ఎందుకంటే!

Share

ఒకప్పటి హీరోయిన్ లయ స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే అమెరికాలో ఉండే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అభిమానులను ఖుషి చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తెలుగు సినిమా పాటలకు స్టెప్స్ వేస్తూ అలరిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఓ స్టార్ డైరెక్టర్ వెల్లడించాడు. అది కాస్తా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలకృష్ణకు చెల్లి అనగానే

విజయవాడలో పుట్టి పెరిగిన లయ నలంద కళాశాలలో చదువుకుంది. ఆ తరువాత టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించింది. అయితే డైరెక్టర్ వివి వినాయక్ చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణకు చెల్లెలుగా లయను నటింపజేయాలని అనుకున్నాడు. ఈ సినిమాలో శ్రియా శరణ్, టబు హీరోయిన్లుగా తీసుకున్నాడు. బాలకృష్ణకు సోదరి పాత్ర కోసం అప్పటికే హీరోయిన్‌గా చేస్తున్న లయను అనుకున్నాడు. అనంతరం ఆమెను కలసి కథ వివరించాడు. అయితే బాలయ్యకు చెల్లెలిగా నటించమని చెప్పగానే ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట.

ఏడ్చేసిన హీరోయిన్ లయ

అంతేకాకుండా, లయ వినాయక్ మీద ఫైర్ అయిందట. ‘ఏంటండీ తెలుగు అమ్మాయిలను సిస్టర్ పాత్రలకే పరిమితం చేస్తారా? ఎప్పుడూ ఆ పాత్ర కోసం ఎందుకు అడుగుతారు. హీరోయిన్ పాత్రలోకి తెలుగు అమ్మాయిలు పనికిరారా, ఏంటి?’ అని అడిగిందట. అప్పుడు వినాయక్ బదులిస్తూ.. “మీరు చాలా అమాయకంగా ఉంటారు, నేను అనుకున్న పాత్రకు మీరు కరెక్ట్‌గా సెట్ అవుతారు అనిపించి వచ్చాన”ని చెప్పారట. తెలుగు అమ్మాయిలను ఎందుకు అలా చేస్తారు? హీరోయిన్లుగా ఎందుకు ఛాన్స్ ఇవ్వరు అంటూ కళ్లలో నీళ్లు పెట్టుకొని బాధపడుతూ అడిగిందట. లయ అడిగిన ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేక సారీ అమ్మ ఏమి అనుకోకండి అని చెప్పి అక్కడినుండి చేశాడట వినాయక్. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వినాయక్ చెప్పారు. ఆ తరువాత బాలకృష్ణకు చెల్లెలుగా దేవయాని నటించింది.


Share

Related posts

Protien: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే ఇంతా ప్రమాదమా..!?

bharani jella

బ్యాక్ టు వ‌ర్క్ అంటున్న మ‌హేశ్‌

Siva Prasad

Ram charan : రామ్ చరణ్ కూడా ఛాన్స్ ఇచ్చేశాడు..ఇక ఆమె ఎన్నేళ్ళు ఇండస్ట్రీని ఏలుతుందో..?

GRK