చేయాల్సిందంతా చేసి చివర్లో సిస్టర్ అంటాడు.. హీరో విక్రమ్‌పై సదా సంచలన కామెంట్స్!

Share

ప్రముఖ నటి సదా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అపరిచితుడు అని చెప్పచ్చు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగు, తమిళ భాషలో భారీ విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో విక్రమ్ అద్భుతంగా నటించాడు. ఆయన తన నటనతో అందరి చేత వావ్ అనిపించాడు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన సదా నటించింది. ఈ ముద్దుగుమ్మ అపరిచితుడు షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.

చెల్లి అనేవాడు

“విక్రమ్‌తో నా పెయిర్ బాగుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా మంచిగా కుదిరింది అని సెట్‌లో అందరూ అనేవారు. కానీ హీరో విక్రమ్ మాత్రం నన్ను సిస్టర్ అన్ని పిలిచేవాడు. కథలో భాగంగా మేం కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వచ్చేది. ఆ సమయంలో డైరెక్టర్ స్టార్ట్ అనగానే రొమాంటిక్ సీన్స్‌లో యాక్ట్ వాళ్లం. ఆ తరువాత డైరెక్టర్ కట్ చెప్పగానే విక్రమ్ నన్ను సిస్టర్ అంటూ పిలిచేవాడు. అప్పుడు నేనే కాదు సెట్‌లో ఉన్న వాళ్లు కూడా బాగా నవ్వుకునేవారు. విక్రమ్ నాతో రొమాంటిక్‌గా నటించి ఆ తర్వాత చెల్లి అనడం వింతగా అనిపించేది. ఆయన చెల్లి అని పిలబడం తో నేను కూడా విక్రమ్ న్ని అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేశా. ఈ విషయంపై శంకర్ సీరియస్ అయ్యాడు.” అని హీరోయిన్ సదా చెప్పుకొచ్చింది.

ఆ విషయంపై శంకర్ సీరియస్‌

“ప్రేక్షకులు హీరోహీరోయిన్స్‌ని లవర్స్ గానే చూస్తారు కానీ అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు లాగా అస్సలు చూడరు. మీరిలా అన్న చెల్లెలుగా పిలుచుకుంటున్న విషయం బయట తెలిస్తే.. ప్రేక్షకులు మిమల్ని లవర్స్ అన్న దృష్టిలో చూడలేరు. అప్పుడు అంతా నాశనమవుతుంది అని శంకర్ అన్నారు. ఆ తర్వాత మేం అలా పిలుచుకోవడం మానేశాం” అని సదా చెప్పింది. ఏదైతేనేం చివరికి ఈ జంటకు ప్రేక్షకులు ఫుల్ మార్క్స్ వేసి సినిమాని సక్సెస్ చేసారు.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆప్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

4 నిమిషాలు ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

8 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

11 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago