NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్చ్.. హైకోర్టు ఒప్పుకోలేదు..! జగన్ కి మళ్ళీ చుక్కెదురు..!!

 

ఏపిలో పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో జరిగింది. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ కౌంటర్ ‌దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఓ పక్క ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఆయన ఆ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు జరగకూడదనే పట్టుదలతో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఎస్ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. కాకపోతే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ప్రకటించారు. దీంతో ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ముక్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మరో పక్క అసెంబ్లీలోనూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇలా తీర్మానం చేయడం రాజ్యంగ విరుద్ధమంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల గవర్నర్ కు లేఖ కూడా రాశారు. ప్రభుత్వం నుండి ఆర్డినెన్స్ వస్తే ఆమోదించవద్దని, అవసరమైతే సుప్రీం న్యాయనిపుణులను సంప్రదించాలనీ నిమ్మగడ్డ కోరారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది    ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంటూ ఎస్ఈసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎకపక్షంగా ప్రకటన చేశారని ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఎస్ఈసీ ప్రకటన సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదని అన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే ఆరు వేల మందికిపైగా మృతి చెందారనీ, ఈ తరుణంలో ప్రభుత్వానికి ప్రజారోగ్యం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. దీనిపై పలు మార్లు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం నేడు తాజాగా తీర్పు వెల్లడించింది.

ఇటీవల కేరళలోనూ ఇటువంటి అంశమే జరిగింది. ఓ వ్యక్తి కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు విచారణ జరిపి ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై సదరు వ్యక్తి హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడా హైకోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేకుంటే కొట్టివేస్తామని సుప్రీం కోర్టు పేర్కొనడంతో పిటిషనర్ ‌తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N