NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ స్పీచ్ హైలెట్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర  ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. తొలుత కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది.

Highlight was the video of ap CM YS Jagans speech in the Telangana Assembly
Highlight was the video of AP CM YS Jagans speech in the Telangana Assembly

రాష్ట ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం (బీఆర్ఎస్) విఫలమైందని ఆరోపించింది. కేసిఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే .. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదని, రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది.

అనంతరం సభలో తీర్మనం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చారు. ఏపీకి నీటి తరలింపునకు నాటి సీఎం కేసిఆర్ ఏ విధంగా సహకరించారనే విషయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కృష్ణాజలాలను ఏపీకి ధారాదత్తం చేశారని ఉత్తమ్ అన్నారు.

కేసిఆర్, జగన్ లు అనేక సార్లు ప్రగతి భవన్ లో కలుసుకున్నారనీ, బిర్యానీ తిని కృష్ణానీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు. ఎంత నీటిని తరలించారో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్, కేసిఆర్ లు ఏకాంత చర్చలు జరిపి నీటిని ఏపీకి తరలించుకుపోయారని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో కేసిఆర్ ను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియోను తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రదర్శించిన జగన్ ప్రసంగ వీడియో హైలెట్ గా నిలిచింది. కేసిఆర్ వల్లనే ఏపీకి నీళ్లు విడుదల అయ్యాయని జగన్ అంటూ ధన్యవాదులు తెలియజేస్తూ మాట్లాడటం ఆ వీడియోలో కనిపించింది. అప్పుడు ఉదారంగా నీళ్లు విడుదల చేసి ఇప్పుడు అసత్యాలు మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ పై అధికార పక్షం విమర్శలు గుప్పించింది.

Nellore: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు ఎస్పీకి మరదలు ప్రియ ఫిర్యాదు.. తీవ్రమైన అభియోగాలతో..

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju