NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. ఆయ‌న కార్ల విలువ రూ. 40 వేల కోట్లు.. అతనెవరో తెలుసా?

రాజులు అంటే రాజ‌సం ఉట్టిప‌డే విధంగా… ప్ర‌పంచ‌లోని రాజ్యాలన్నింటికీ త‌మ గురించి తెలిసే విధంగా వారు సిరి సంప‌ద‌లు, వైభోగాల గురించే తెలిసే విధంగా న‌డుచుకునే వారని పుస్త‌కాల్లో చ‌ద‌వ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. అయితే, ఇప్ప‌టికీ.. అలా జీవించే రాజు ఉన్నాడు. ఆయ‌న కొన్న కార్ల విలువే దాదాపు 40 వేల కోట్ల‌ రూపాయ‌ల‌కు పైగా ఉంటుందంటే ఆయ‌న ఎంత రాజ‌సంగా, విలాస‌వంతమైన జీవితం గ‌డుపుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అనుకుంటా.. !

ఏ రాజు? ఎక్క‌డున్నాడు అనే క‌దా మీ ప్ర‌శ్న‌లు? తెలుసుకుందాం ప‌దండి మ‌రి ఇక‌.. ! బ్రూనై…ప్ర‌పంచంలో సిరిసంప‌ద‌ల‌తో వ‌ర్ధిల్లుతున్న ధ‌నిక దేశం. ఆ దేశంలో ఇప్ప‌టికీ రాచ‌రిక‌మే న‌డుస్తోంది. దాదాపు 600 సంవ‌త్స‌రాలుగా ఆ రాజ కుటుంబ‌మే ఆ దేశాన్ని పాలిస్తోంది. ఇక విష‌యానికి వ‌స్తే.. బ్రూనై సూల్తాన్‌.. గ్యారేజీలో 600 రోల్స్‌రాయిస్ కార్లు , 570 మెర్సిడెజ్‌ బెంజ్‌లూ, 450 ఫెరారీలూ, 380 బెంట్లీలూ, 200 బిఎండబ్ల్యూ కార్లు, 170 జాగ్వార్‌లూ ఇలా చెప్పుకుంటు పోతే లెక్క చాలా పెద్ద‌గానే ఉంటుంది. ఈ లెక్క‌ల‌న్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇవ‌న్నీ సుల్తాన్ ద‌గ్గ‌ర వున్న కార్ల లెక్క‌లు. ప్రపంచంలో మ‌రెవ్వ‌రి ద‌గ్గ‌ర లేన‌న్ని కార్లు, దాదాపు రూ. 40 వేల కోట్ల‌కు పైగా విలువ చేసేవి ఉన్నాయి. ఇవ‌న్నీ మాములు కార్లు అనుకోకండి, ఆయ‌న కోస‌మే ప్ర‌త్యేకంగా క‌స్ట‌మైజ్ చేసిన కార్లు.

బ్రూనై సుల్తాన్‌కు కార్లంటే మ‌హా ఇష్టం. విలాస‌వంత‌మైన కార్ల‌లో రైడ్‌కు వెళ్ల‌డం ఆయ‌న‌కు మ‌హా ఇష్ట‌మ‌ట‌. అందుకే ఈ స్థాయిలో కార్లు కొన్నాడ‌ట‌. మెక్‌లారెన్ కంపెనీ త‌యారు చేసిన ప్ర‌త్యేక‌మైన ఎఫ్ 1 కార్లు దాదాపు వంద కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ విలువ చేస్తాయి. అలాంటి కార్లు రాజుగారి ద‌గ్గ‌ర 10 పైగా ఉన్నాయ‌ట‌. ఇక సుల్తాన్ పెళ్లి సంద‌ర్భంగా కొన్న రోల్స్ రాయిస్ మ‌రి ప్ర‌త్యేకం. ఎందుకంటే రూ. 104 కోట్లు పెట్టి కొన్న ఆ కారును.. ఆ త‌ర్వాత 24 క్యారెట్స్ బంగారంతో పూత పూసి రీడిజైన్ చేశారంట‌. దాని విలువ ఎంత‌వుంటుందో మీరే ఊహించుకోండి ఇక !

కేవ‌లం ఇవే కాదండోయ్ ఆయ‌న ద‌గ్గ‌ర బుగాటి ఇబి110, ఆస్టన్‌ మార్టిన్‌, లాంబొర్గి వంటి ఖ‌రీదైన కార్లు చాలానే ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా చాలా కంపెనీల ద‌గ్గ‌ర త‌న‌కోస‌మే ప్ర‌త్యేకంగా త‌యారు చేయించుకున్నారు. సుల్తాన్ ద‌గ్గ‌ర త‌ప్పా.. ఆ కార్లు మీకు ఎక్క‌డా క‌న‌ప‌డ‌వు సుమా ! అంతే కాకుండా ఆయ‌న ద‌గ్గ‌ర రూ. 722 కోట్ల ఎయిర్‌బస్‌, రూ. 1300 కోట్ల బోయింగ్‌, రూ.2 వేల కోట్ల కస్టమైజ్‌డ్‌ బోయింగ్ వంటి విమానాలు సైతం చాలానే ఉన్నాయి. సుమారు ఇరవై ఒకటిన్నర లక్షల చదరపు అడుగులతో ప్ర‌పంచంలోనే అతిపెద్ద రాజ‌భ‌వ‌నం సుల్తాన్ దే కావ‌డం విశేషం. ఇంతల అక్క‌డ సిరిసంప‌ద‌లు క‌ల‌గ‌డానికి కార‌ణం అక్క‌డ ల‌భించే చ‌మురే. ఈ దేశానికి సుల్తానే రాజు , మంత్రి, ర‌క్ష‌కుడు అన్నీ. ఎంతైనా ధనవంతుల విలాసాలు ఎంత చెప్పుకున్నా తక్కువే సుమా..!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N