తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా చెపాప్పల్సిన పనిలేదు. ఎందుకంటే సాధారణ నటుడిగా కెరియర్ ప్రారంభించి.. కోలీవుడ్లో అగ్ర కథానాయకుడిగా మంచి పేరు సంపాదించిపేట్టుకున్నారు. ఆయన నటించిన గజిని, ఆరు, దేవా, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సింగం సినిమాలతో ఆయన జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. మరీ ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సూర్య అనే విధంగా సింగ్ సిరీస్లో వచ్చిన సినిమాలతో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారు.
ప్రస్తుతం స్టార్ హోదాలో కనిపిస్తున్న సూర్య.. సినీ రంగంలోకి రాకముందు జీవితాన్నిగుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు పడిన కష్టాల కడలిని దాటినాకే నేడు ఈ స్థాయికి చేరుకున్నానని సూర్య చెప్పారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ఆకాశం నీ హద్దురా సినిమా ఈ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. నేపథ్యంలోనే ఆయన మీడియాలో ముచ్చటించారు. ఈ సందర్భంగా సూర్య పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు తమ కుటుంబం పడిన ఆర్థిక పరిస్థితులను గురించి వివరించారు.
ఒకానోక సమయంలో అప్పుగా తీసుకున్న రూ.25 వేలను తీర్చలేని ఆర్థిక పరిస్థితుల్లోకి తన కుటుంబం దిగజారిపోయిందని అన్నారు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం పెద్ద కొడుకుగా తన బాధ్యత తనపై పడిందని.. ఈ క్రమంలోనే మనీ అవసరం కోసమే సినీ నట జీవితాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఆ సమయంలో నటన గురించి తనకేమి పెద్దగా తెలియదనీ, తెలిసిందల్లా ఒక్కటే కాలేజీకి వెళ్లడం, చదువుకోవడమేనని అన్నారు. తాను నటించిన మొదటి సినిమాకు రూ.50 వేల రెమ్యూనరేషన్ ఇచ్చారని సూర్య తెలిపారు.
అయితే, అప్పటికే సూర్య తండ్రి కోలీవుడ్లో నిర్మతగా పలు సినిమాలు తీశారు. కానీ తన తండ్రి పేరును వాడుకోలేదని తెలిపారు. అయితే, ఆయనకు మొదట ఆశ సినిమాలో హీరోగా అవకాశం రాగా.. నటనపై ఆసక్తి లేకపోవడంతో దానికి నో చెప్పారట. ఎట్టకేలకు తప్పని పరిస్థితిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నెర్రుక్కు నెర్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ తర్వాత అనేక సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే.. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సూర్యకు అవకాశాలు వస్తుండటం ఆయన నటనకు నిదర్శనం. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి.