NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఢిల్లీలో కేసీఆర్ గెలుపు × ఆంధ్ర ఓటమి ఎలా??

కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీ వెళితే ఆయనకు నిమిషాల్లో క్షణాల్లో పెద్దపెద్ద సార్ల అపాయింట్మెంట్లు దొరుకుతాయి… వారిని చక చాక కలిసి చకచకా పనులు చక్కబెట్టుకుంటుకొస్తారు. గంటలకు గంటలు కేసీఆర్ తో ఢిల్లీ పెద్దల సమావేశాలు జరుగుతాయి. ఆయన చెప్పింది అక్కడ వారు చక్కగా వింటారు అర్థం చేసుకుంటారు. ఆయనకి ఏం కావాలో అక్కడినుంచి ఏం ఆశిస్తున్నారో చక్కగా చెప్పగలరు… కానీ ఆంధ్రప్రదేశ్ నేతలు విషయానికొస్తే ఢిల్లీలో పూర్తిగా వారిది అట్టర్ ప్లాప్ షో. కనీసం ఇక్కడి నేతలను ఢిల్లీ పెద్దలు పట్టించుకున్న పాపాన పోరు. అపాయింట్మెంట్ల కోసం రోజులకు రోజులు వేచి చూడాలి. అంతకు కాకపోతే ఎవరైనా పెద్ద వారితో చెప్పించు కోవాలి. ఒకవేళ కలిసిన రెండే రెండు నిమిషాల్లో మాటలుంటాయి. చేతలు విషయానికొస్తే సున్నా. ఢిల్లీలో కెసిఆర్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు ఆంధ్రనేతలు ఏ పార్టీ వారైనా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఒకసారి పరిశీలిద్దాం.

** ఢిల్లీ లాబీల్లో ఎక్కువగా వాడేది హిందీ. ఉత్తరాది నాయకులంతా దారాళంగా హిందీలో మాట్లాడగలరు. గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారు సైతం హిందీలోనే మాట్లాడతారు. వారు చక్కటి హిందీ ని గమనించగలరు మాట్లాడగలరు. కెసిఆర్ కు ఇదే ప్లస్ అవుతోంది. కెసిఆర్ హిందీలో అవలీలగా మాట్లాడగలరు. చాలా ఫ్లో గా మాట్లాడడం తో పాటు మంచి కమ్యూనికేషన్ ను హిందీ లో ఇవ్వగలరు. అలాగే ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే దాన్ని వారికి అర్థమయ్యే హిందీ యాస లోనే చెప్పగల ప్రతిభ కేసీఆర్ సొంతం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి హిందీ ఒకే రకంగా పలకడంలో తేడాలుంటాయి. దక్షిణాది వారు హిందీ పలికే విషయానికి ఉత్తరాది వారు మాట్లాడే తీరు చాలా తేడా ఉంటుంది. అయితే కెసిఆర్ హిందీలో అనర్గళంగా మాట్లాడటం కాదు… వ్యాసాలు సైతం ఆయన మార్చగలరు. అలాగే ఎక్కువ పుస్తకాలు చదివిన అనుభవం తో పాటు చరిత్ర, వర్తమాన అంశాల మీద ఆయనకి మంచి పట్టు ఉండడం కూడా కలిసి వస్తోంది. ఢిల్లీ పెద్దలు కలిసినప్పుడు కేవలం ఆయన వచ్చిన పని గురించి కాకుండా ఇతర అంశాలను స్పృశిస్తూ దానిలోకి వారిని తీసుకెళ్లి, దాని గురించి చర్చించి లోతైన అధ్యయనంతో విషయం వివరించడంతో ఎదుటివారు ముద్దులు అవుతారు. దీంతో చివర్లో కెసిఆర్ చెప్పే పనులు సైతం సులభంగా అవుతుంది. ఇది కేసీఆర్ విజయం సీక్రెట్. ఢిల్లీని గెలుస్తున్న కేసీఆర్కు భాషే ప్రధాన బలం ఆయుధం. ఇక అన్ని అంశాల పై ఆయనకున్న అవగాహన సైతం దీనికి తోడ్పడుతోంది.


** ఆంధ్ర నేతల విషయానికి వస్తే ఏ నాయకుడు హిందీలో అనర్గళంగా మాట్లాడలేడు. ఆంధ్రా లోని 25 మంది ఎంపీలు తో పాటు ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి సైతం హిందీలో అంత అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం లేదు. ఇక మిగిలిన నాయకులదే అదే పరిస్థితి. ఢిల్లీ పెద్దలను వీరు కలిసిన కేవలం వినతిపత్రాలు ఇచ్చి, హౌ ఆర్ యు హౌ ఆర్ యు డు అనే పొడి పదాలతో పలకరింపులు, ఎక్కువగా ఆంగ్ల భాషలోనే సమస్యలను వివరించే ప్రయత్నాలు జరుగుతాయి. ఢిల్లీ పెద్దల్లో ఎక్కువమందికి ఆంగ్లంలో అంత ప్రావీణ్యం లేదు. ఆంధ్ర నేతల కేమో హిందీ లో ప్రావీణ్యం లేదు. దీంతో ఇరు పక్షాలు కలిసిన సరే కమ్యూనికేషన్ గ్యాప్ పూర్తిగా ఉంటుంది. ఇది అన్ని విషయాల మీద ప్రభావం చూపుతుంది. రాష్ట్రానికి ఏం కావాలి ఏం చెప్పదలుచుకున్నాను అనే విషయాలను ఢిల్లీ పెద్దలకు సరైన రీతిలో ఆంధ్రనేతలు ప్రజెంట్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం కేవలం హిందీ. ఢిల్లీ పెద్దలను ఆకట్టుకునే భాష ఆంధ్ర నేతలకు లేకపోవడం పెద్ద లోటు.
** ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రా నేతల పరిస్థితి ఇదే. కాంగ్రెస్ నేతలు సైతం ఆంధ్ర వారిని భాష రాని వారు గానీ ఇప్పటికీ చూస్తారు. అలాగే ఇప్పుడు బిజెపి నేతలు సైతం అలాగే తయారయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం కొందరు ఢిల్లీ స్థాయి నేతలు ఆంధ్ర వారు వస్తే నవ్వుకునే వారు. ఏదో చెబుతున్నాడు ఏదో వింటున్న అన్నట్లు వారి ఎక్స్ప్రెషన్స్ కనిపించేవి. ప్రస్తుతం ఉన్న 25 మంది ఎంపీల్లో సుమారు 20 మందికి ఇటు హిందీతో పాటు ఆంగ్లం అంతంతమాత్రమే. దీంతో వారు ఏమీ చెప్పలేక కేవలం వినతిపత్రాలు ఇచ్చి ఢిల్లీలో నెట్టుకొస్తున్నారు. ఎంపీలు వెళ్ళిన వారిని కనీసం పట్టించుకునే వారు ఉండరు. మీరేం చెప్పదలుచుకున్న వారికి అర్థం కాని పరిస్థితి. ఈ ఒక్క కారణం తోనే దేశ రాజధానిలోకేసీఆర్ గెలుస్తున్నారు ఆంధ్ర నేతలు కోరుతున్నారు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N