NewsOrbit
న్యూస్

ఆడ పిల్ల‌ల కోసం సుక‌న్య స‌మృద్ధి అకౌంట్‌.. ఎలా ఓపెన్ చేయాలంటే..?

కేంద్ర ప్ర‌భుత్వం ఆడ పిల్ల‌ల‌ను ర‌క్షించేందుకు, వారి ప్ర‌గ‌తికి బాట‌లు వేసేందుకు బేటీ బ‌చావో, బేటీ ప‌ఢావో యోజ‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఆడ పిల్ల‌ల త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (ఎస్ఎస్‌వై) ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. అందుకుగాను వారు గ‌రిష్టంగా ఇద్ద‌రు వేర్వేరు ఆడ‌పిల్ల‌ల పేరిట సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అకౌంట్ల‌ను తెర‌వ‌వ‌చ్చు. ఈ అకౌంట్‌లో పొదుపు చేసే డ‌బ్బుకు ఏడాదికి 7.6 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు.

how to open Sukanya Samriddhi Yojana Account?

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అకౌంట్‌ను ఏ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో అయినా ఓపెన్ చేయ‌వ‌చ్చు. అకౌంట్ ఓపెన్ చేశాక 15 ఏళ్ల పాటు అందులో డ‌బ్బులు పొదుపు చేయ‌వ‌చ్చు. ఆడ‌పిల్ల‌కు 18 ఏళ్ల త‌రువాత పెళ్లి చేస్తే ఆ అకౌంట్‌లోని మొత్తాన్ని విత్‌డ్రా చేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. లేదా వారికి 21 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చాక ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయ‌వ‌చ్చు. ఇక ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే ఆడ‌పిల్ల‌కు 10 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. అయితే ఈ అకౌంట్‌ను కేవ‌లం బ్యాంక్ లేదా పోస్టాఫీస్ బ్రాంచిల‌కు వెళ్లి మాత్ర‌మే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయ‌లేరు.

ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తామ‌ని చెబితే వారు ఫాం ఇస్తారు. దాన్ని నింపి అవ‌స‌ర‌మైన కేవైసీ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి. ఆడ‌పిల్ల బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, అడ్ర‌స్ ప్రూఫ్‌, ఐడీ ప్రూఫ్‌, ఆమె త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల ధ్రువ‌ప‌త్రాలను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దీంతో అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌చ్చు.

ఆరంభంలో క‌నీసం రూ.250 చెల్లించాలి. గ‌రిష్టంగా రూ.1.50 ల‌క్ష‌లు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. త‌రువాత అందులో ఆ రెండు మొత్తాల మ‌ధ్య ఎంతైనా పొదుపు చేయ‌వ‌చ్చు. అకౌంట్ ఓపెన్ అయ్యాక పాస్‌బుక్ ఇస్తారు. అయితే ఇత‌ర బ్యాంక్ అకౌంట్ల‌లో నుంచి నెల నెలా కొంత మొత్తం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా క్రెడిట్ అయ్యేలా బ్యాంకింగ్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్ల‌ను కూడా సెట్ చేసుకోవ‌చ్చు. అందుకు ఇత‌ర ఏదైనా బ్యాంకుకు చెందిన నెట్ బ్యాంకింగ్ కావాలి. దాంట్లో ఆ ఇన్‌స్ట్రక్ష‌న్ల‌ను సెట్ చేసుకుంటే నెల నెలా నిర్దిష్ట మొత్తంలో సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అకౌంట్‌లోకి ఆటోమేటిగ్గా క్రెడిట్ అవుతుంది. దీంతో డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు.

ఇక ఏడాదిలో క‌నీసం రూ.250 అయినా డిపాజిట్ చేయాలి. లేదంటే అకౌంట్‌ను నిలిపివేస్తారు. ఈ క్ర‌మంలో రూ.50 ఫైన్ చెల్లించి అకౌంట్ ను ఎప్ప‌టిలా కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే అకౌంట్ ఓపెన్ అయ్యాక 15 ఏళ్ల వ‌ర‌కు అకౌంట్‌ను ఎప్పుడైనా రీయాక్టివేట్ చేసుకోవ‌చ్చు. కాక‌పోతే ఏడాదికి రూ.50 ఫైన్ చెల్లించాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N