money: మీరు ధ్యానం చేసుకోవాలి అంటే ఈశాన్య దిశ చాలా మంచిది. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈశాన్యంలో ధ్యానం చేయడం ఉత్తమం.
అంతే కాదు..ఈశాన్యం దిక్కు లో పొడవైన రోడ్డు మార్గం ఉన్నటువంటి సీనరీ పెట్టుకోవడం మంచిది.ఫ్యామిలీ ఫొటోను బంగారం , లేదా పసుపు వర్ణంలోఉన్న ఫ్రేమ్‌తో తయారు చేయిన్చుకుని నైరుతి దిశలో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చాలా బాగుంటాయి. అలా కాదు అంటే పొద్దుతిరుగుడు పువ్వు ఫొటో లేదా పెయింటింగ్‌ను అయినా కూడా పెట్టుకోవచ్చు.
తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడు పెయింటింగ్ లేదా ఫోటో పెట్టుకోవడం వలన సామాజిక సంబంధాలు మెరుగవుతాయి.
తూర్పు దిశలో పిల్లల స్టడీ టేబుల్నుఉంచితే చదువులో వృద్ధి చెందుతారు. ఇంట్లో తలుపులు, కిటికీ లు సరి సంఖ్యలో ఉండేలా చూసుకోండి. వేగంగా పరుగులు పెడుతున్న ఎర్రటి రంగులో ఉన్న గుర్రాల ఫొటోస్ కానీ విగ్రహాన్ని కానీ దక్షిణ దిక్కున పెట్టడం వలన సంపద ప్రవాహంలా వస్తుంది. సామరస్యం కూడా వృద్ధి అవుతుంది.వివాహ బంధం బలంగా ఉండటానికి మంచం మీదఓకే పరుపును ఉంచండి. భర్తకు భార్య ఎడమ వైపు మాత్రమే నిద్రపోవాలి. ఇంట్లో అవసరం లేని వస్తువులు ఉంచవద్దు. ముఖ్యంగా మంచం కింద ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనసు గతంలోకి వెళ్తూ ఉండడం వలన సంతోషంగా ఉండలేరు.
పడక గదిని ఎప్పుడూ పూర్తి చీకటిగా ఉండకూడదు. వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అలాగే పడక గది గోడలకు ముదురు రంగు వేసుకోకూడదు. బాత్రూంలో సహజమైన మొక్కలు లేదా క్యాండిల్స్ పెట్టుకోవడం వలన ప్రతికూల ప్రభావం తగ్గిపోతుంది.
కుటుంబ యొక్క అనుబంధాన్ని వంటగది ఎంతో ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.వంట గదిలో గ్యాస్ స్టవ్ కి సింక్ కి మధ్య సాధ్యమైనంత ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాలి. సంబంధాలు బలోపేతం చేసుకోవడం కోసం పడక గది నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి.మూలల్లో పడుకోవడం మంచిది కాదు . మూలల్లో నిద్ర పోవడం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఈశాన్య దిశలో వాటర్ ఫౌంటెన్ ఉండేలా చూసుకోవడం మంచిది.తూర్పు దిశలో ఆకుపచ్చని మొక్కలు పెంచడం కుటుంబ శ్రేయస్సు కు మంచిది.