Ileana : ఇలియానా టాలీవుడ్లో ఒకపుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. వైవిఎస్ చౌదరీ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా పరిచయమైన దేవదాసు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఈ సినిమాలో ఇలియానా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందన్న పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో ఇలియానా వరసగా సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఒకానొక దశలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. అయితే అనూహ్యంగా ఇలియానా కెరిర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కొన్నేళ్ళు టాలీవుడ్లో సినిమాలు చేయలేదు. ఇక ఇలియానా పనైపోయిందనుకుంటున్న సమయంలో మాస్ మహారాజ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్లో అవకాశాలు దక్కేవేమో.
Ileana : ఇల్లీ బేబీ.. రణదీప్ హుడాతో కలిసి నటిస్తోంది.
కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. దాంతో మళ్ళీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ టాలీవుడ్ కంటే బాలీవుడ్లో ఇల్లీ బేబీ కెరీర్ కాస్త ఆశాజనికంగా ఉందని చెప్పొచ్చు. సినిమా తర్వతా సినిమాతో బాలీవుడ్లో బాగానే నెట్టుకొస్తోంది. బర్ఫీ- మెయిన్ తేరా హీరో- రైడ్- పాగల్ పంథి లాంటి సూపర్ హిట్ల సినిమాలో నటించి పాపులర్ అయిన ఇలియానా త్వరలో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన ది బిగ్ బుల్ సినిమాతో రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అన్ ఫెయిర్ & లవ్లీలో సినిమాలో నటిస్తున్న ఇల్లీ బేబీ.. రణదీప్ హుడాతో కలిసి నటిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!