Allu arjun: అల్లు అర్జున్ టార్గెట్ మార్చుకున్నాడా.. ఇలా అయితే పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ దక్కేనా..?

Share

Allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో పోటీ పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకునేందుకు తాపత్రయపడుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, తారక్ హీరోలుగా నటించారు. బాహుబలి సినిమాలతో ప్రభాస్ – రానాలకు పాన్ ఇండియన్ స్టార్స్‌గా క్రేజ్ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు తారక్, చరణ్‌లకు ఆ క్రేజ్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వీరిని పాన్ ఇండియన్ స్టార్స్‌గా అందరూ చెప్పుకుంటున్నారు. ప్రభాస్ తర్వాత అదే రేంజ్ క్రేజ్ చరణ్, తారక్‌లకు వచ్చేసినట్టే.

is-allu-arjun-changed-his-target
is-allu-arjun-changed-his-target

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకోవాలని శ్రమించాడు. అయితే పుష్ప సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాకు సంబంధించిన ఏ మాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. పుష్ప సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్ బాలీవుడ్ మీద గట్టిగా ఫోకస్ చేశారు. అక్కడ మార్కెట్ సంపాదించుకొని భారీ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకోవాలనుకున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ఇకపై ప్రభాస్‌ను ఫాలో అవ్వాలనున్నాడు.

Allu arjun: అల్లు అర్జున్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియన్ కథలై ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

తెలుగుతో పాటు ఇక పై అల్లు అర్జున్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియన్ కథలై ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ రకంగా కొత్త కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంతేకాదు బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ దృష్ఠి మొత్తం తమిళ ఇండస్ట్రీ మీదకి మారినట్టు తెలుస్తోంది. హిందీ ఇండస్ట్రీమీద ఎక్కువ ఫోకస్ చేయడం లేదని పుష్ప హిందీ ప్రమోషన్స్ చూస్తే తెలుస్తోంది. ఎందుకనో ఈ సినిమా బాలీవుడ్‌లో ముందు నుంచి టాక్ పరంగా బాలీవుడ్‌లో వీక్‌గా ఉంది. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలోనూ చాలా వీక్‌గా ఉంది. మరి ఎందుకో పుష్ప హిందీ వెర్షన్ మీద నిర్మాతలు ఆసక్తి చూపడం లేదో.


Share

Related posts

నాగార్జునపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

sarath

Chiranjeevi: మెగాస్టార్ ప్లాన్ అదే అయితే ..మెగా ఫ్యాన్స్‌కు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఇంకోటి ఉండదు..

GRK

వెండితెర నుంచి నిజ జీవితానికి జంటలు

Teja