Nani: నేచురల్ స్టార్ నానికి మరో గట్టి దెబ్బ..టక్ జగదీష్ ఎఫెక్ట్ ఆ సినిమాల మీద పడితే ఇక అంతే

Share

Nani: టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా నానికి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి యూ టర్న్ తీసుకొని అష్టా – చమ్మా సినిమాతో హీరోగా మారాడు నాని. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఒక్కో సినిమా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అండ్ మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. నానికి ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ అనే పేరు ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీ. తన పర్ఫార్మెన్స్ ఎంతో సహజంగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యాడు.

is nani- tuck jagadeesh movie effects other movies
is nani- tuck jagadeesh movie effects other movies

మాస్ సినిమా చేసినా, క్లాస్ సినిమా చేసినా నానికి మార్కెట్ బాగా పెరుగుతూ వచ్చింది. కెరీర్‌లో ఇప్పటి వరకు నానీకి లాంగ్ గ్యాప్ వచ్చింది లేదు. సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా ఫ్లాపయినా ఆఫర్స్ మాత్రం వరుసగా వస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా నానికి పేరు ఉంది. అందుకే నానితో సినిమాలు నిర్మించడానికి ఎప్పుడు నిర్మాతలు సిద్దంగా ఉంటారు. చెప్పాలంటే నానితో సినిమాలు నిర్మించిన నిర్మాతలు ఎప్పుడు భారీగా నష్టపోయింది లేదనే చెప్పాలి. అందుకే నాని సినిమాలను ఏడాదిలో రెండైనా రిలీజ్ చేస్తున్నారు.

Nani: కృష్ణార్జున యుద్దం, దేవదాస్ ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి.

అయితే నిన్ను కోరి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు భారీ హిట్ అనేది నానికి దక్కలేదు. శివ నిర్వాణ దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన నిన్ను కోరి అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి లాభాలను తెచ్చింది. నాని అకౌంట్‌లో మంచి హిట్‌గా చేరింది. కానీ ఆ తర్వాత నుంచి నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. దేవదాస్, కృష్ణార్జున యుద్దం, గ్యాంగ్ లీడర్, జెర్సీ, వి లాంటి సినిమాలు నాని నుంచి వచ్చాయి. అయితే జెర్సీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అవార్డులు దక్కించుకుంది.

కానీ భారీ కమర్షియల్ హిట్‌గా నిలవలేదు. కృష్ణార్జున యుద్దం, దేవదాస్ ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. వి సినిమా కూడా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో నాని కంటే సుధీర్ బాబుకే ఎక్కువ పేరొచ్చింది. దీనికి ముందు వచ్చిన గ్యాంగ్ లీడర్ కూడా నానికి సక్సెస్ ఇవ్వలేదు. ఇలా నిన్ను కోరి సినిమా నుంచి ఇప్పటి వరకు నానికి భారీ హిట్ అనేది దక్కలేదు. అయితే ఇటీవల వచ్చిన టక్ జగదీష్ సినిమాతో హిట్ అందుకుంటానని నాని చాలా నమ్మకంగా ఉన్నాడు.

Nani: కమర్షియల్‌గా టక్ జగదీష్ బాగా డిసప్పాయింట్ చేసింది.

కానీ ఆ నమ్మకాలన్నీ సినిమా తారుమారు చేసింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన టక్ జగదీష్ ఇటీవల ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో రిలీజైంది. థియోటర్స్ రిలీజ్ కోసం ఎదురు చూసిన నిర్మాతలు తప్పని పరిస్థితుల్లో థియేటర్స్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్స్ విమర్శించినా కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పుకుంటున్నారు. కమర్షియల్‌గా టక్ జగదీష్ బాగా డిసప్పాయింట్ చేసింది. దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. అదే ఫాం కంటిన్యూ చేస్తూ టక్ జగదీష్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటే గట్టి షాక్ తగిలింది. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ నాని తర్వాత సినిమాల మీద పడే అవకాశాలున్నాయని టాక్ మొదలైంది.


Share

Related posts

బ్రేకింగ్ న్యూస్… క్లాస్ రూమ్ లో పెళ్లి వీడియో సంఘటనలో ఊహించని ట్విస్ట్!!

Naina

Tollywood: కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు సినిమా పరిస్థితేంటో..!?

Muraliak

NTR – RRR : ఎన్టీఆర్ సినిమాలు ఆలస్యం… ఆందోళనలో అభిమానులు..?

Teja