Raviteja: మాస్ మహారాజాకి ఎందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్ ..అల్లు అర్జున్ను ఫాలో అవుతున్నాడా..? అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ కొందరు మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే ఆయన డ్యూయల్ రోల్లో నటించిన ఖిలాడి విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడని చెప్పుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప: ది రైజ్ పార్ట్ సినిమా 5 భాషలలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్లో స్ట్రైట్‌గా సినిమా చేసి ఎంట్రీ ఇచ్చాడు. సుకుమార్‌కు ఇది మొదటి సినిమా. అయితే, రిలీజ్ సమయం దగ్గర పడినా కూడా పుష్ప పార్ట్ 1 సినిమా ప్రమోషన్స్ హిందీలో అనుకున్నంతగా నిర్వహించలేదు.
తెలుగులో, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఓ మాదిరిగానే నిర్వహించారు. కానీ, సినిమా సాధించిన సక్సెస్, రాబట్టిన వసూళ్ళు ఎవరూ ఊహించలేదు. ఇటీవలే పుష్ప పార్ట్ 1 సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో పుష్ప సినిమా ఓవరాల్ గ్రాస్ రూ 365 కోట్లని మేకర్స్ అధికారికంగానే పోస్టర్‌ను వదిలి ప్రకటించారు. ఇదే స్ట్రాటజీని మాస్ మహారాజ రవితేజ కూడా ఫాలో అవుతున్నాడనిపిస్తోంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన ఖిలాడి సినిమాను ఈ నెల 11వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదలవుతోంది.
Raviteja: పుష్ప సినిమా మాదిరిగా బ్లాక్ బస్టర్
ఇది రవితేజ ఫస్ట్ హిందీ మూవీ. నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్‌కు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. అందుకే అక్కడ రవితేజ ఖిలాడి సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఇంతవరకు అసలు ప్రమోషన్స్ మొదలవలేదు. గట్టిగా ఈ సినిమా రిలీజ్‌కు వారం కూడా లేదు. సినిమా మీద భారీ నమ్మకాలు ఉన్నాయి కాబట్టే రవితేజ చాలా నమ్మకంగా ఉన్నాడట. అందుకే, పెద్దగా ప్రమోషన్స్ కూడా నిర్వహించకుండా గత సక్సెస్ క్రాక్ ఇప్పుడు చేసిన ఖిలాడి సినిమా అవుట్‌పుట్ మీద విపరీతమైన నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి రవితేజ నమ్మకం నిజమై అల్లు అర్జున్ పుష్ప సినిమా మాదిరిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా లేదా చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!