RRR : ఆర్ ఆర్ ఆర్ ..ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియన్ సినిమా. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఫిక్షన్ స్టోరీతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద దేశ వ్యాప్తంగా ఊహించని రీతిలో అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, శ్రీయ శరన్, సముద్ర ఖని వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి నుంచి సినిమా అంటే వ్యాపారం పరంగా చూస్తే భారీ లెవల్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా తమిళ హక్కులు 45 కోట్ల కి పైగానే లైకా ప్రొడక్షన్స్ దక్కించుకున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఇప్పటికే ఐదు భాషల రిలీజ్ హక్కుల డీల్ పూర్తయిందని.. దాదాపు 350కోట్ల వరకి బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో సౌత్‌లోనే రిలీజ్ ముందే అత్యంత భారీ బిజినెస్ చేసిన సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ సరికొత్త రికార్డులు సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడలో ముందు రిలీజ్ చేసి… ఆ తర్వాత మరో ఆరు భాషల్లో డబ్ చేసి మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయాలన్నది దర్శక ధీరుడి ప్లాన్ అట.
RRR : ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ ఏ రేంజ్ లో జరగనుందన్నది వేచి చూడాలి.
బాహుబలి 600 కోట్లు వసూలు చేయగా.. బాహుబలి 2 దాదాపు 1800 కోట్లు వసూలు చేసిందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. మరి ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ ఏ రేంజ్ లో జరగనుందన్నది వేచి చూడాలి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. చరణ్ కి భార్య పాత్రలో ఆలీయా భట్ సీత్ర పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్.. చరణ్, తారక్ ల టీజర్స్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో శాంపిల్ చూపించాడు రాజమౌళి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!