స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ గా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమా సుకుమార్, అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ సినిమా కావడం కూడా విశేషం. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కి నార్త్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉండటంతో సుకుమార్ నార్త్ ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలను ఇందులో చూపించబోతున్నాడని సమాచారం.
ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కి విపరీతంగా క్రేజ్ వచింది. గత రెండు సినిమాలలో ఎంతో క్లాస్ గా చూపించిన సుకుమార్ పుష్ప లో మాత్రం కంప్లీట్ మాస్ గా చూపిస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో పాత్ర కోసం చాలా శ్రమించాడు. మరోసారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడని సమాచారం.
ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ ఈ సినిమాతో ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా నిలవబోతున్నాడని తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా 2021 సమ్మర్ కి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి.
అయితే పుష్ప కూడా అదే సమయానికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ..పుష్ప సినిమాతో ఏకంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కే పోటీగా నిలవబోతున్నాడట. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాయో చూడాలి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!