Tarun : తరుణ్ కుర్ర హీరోల్లో ఒకప్పుడు బాగా క్రేజ్ ని సంపాదించుకొని యమా బిజీగా గడిపాడు సినిమా తర్వాత సినిమా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన తరుణ్ కెరీర్ ఒక్కసారిగా తలకిందులైంది. తన రోజా రమణి నట వారసతాన్ని పుచ్చుకున్న తరుణ్ బాలనటుడుగా కెరీర్ ప్రారంభిం మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2000లో ‘నువ్వేకావాలి’ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. నువ్వేకావాలి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు తరుణ్. నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు లాంటి లవ్ స్టోరీస్ లో నటించి బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
అయితే తరుణ్ క్రేజ్ ఇలా వచ్చి అలా పోయింది. సక్సస్ లు వచ్చినట్టే వచ్చి పోవడంతో తరుణ్ సినిమాలకి దూరమయ్యాడు. గత కొన్నేళ్ళుగా తరుణ్ నుంచి సినిమాలేవి రాలేదు. దాదాపు సినీ కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో పెళ్ళి అంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. మరి పెళ్ళి సంగతేమైందో గానీ మళ్ళీ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Tarun : తరుణ్ కి హిట్ ఇవ్వలేకపోయింది.
కాగా తరుణ్ మరోసారి లవ్ స్టోరీతోనే రాబోతున్నట్టు సమాచారం. తరుణ్ చివరిగా చేసిన ఇది నా లవ్ స్టోరీ సినిమాతో 2018లో వచ్చాడు. ఈ సినిమా కూడా తరుణ్ కి హిట్ ఇవ్వలేకపోయింది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత తన స్నేహితుడు చెప్పిన లవ్ స్టోరీ బాగా నచ్చి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. త్వరలో ఈ సినిమా కి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. చూడాలి మరి తరుణ్ మళ్ళీ సినిమాలు చేస్తూ బిజీ అవుతాడా లేదా..!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!