Vidya Balan: విద్యాబాలన్‌కి కలిసి రాని టాలీవుడ్..ఆ సినిమా ఒప్పుకోవడమే పొరపాటు..?

Share

Vidya Balan: విద్యాబాలన్..బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకదశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. అద్భుతమైన పాత్రలు చేసి తనకంటూ హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. విద్యాబాలన్ పదహారేళ్ల వయసులో బాలీవుడ్ స్టార్ మేకర్ ఏక్తాకపూర్ నిర్మించిన ‘హమ్ పాంచ్’ అనే హిందీ సీరియల్‌లో నటించింది. ఈ సీరియల్ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో హీరోయిన్ అవ్వాలనే కోరిక కలిగింది. ఇదే విషయాన్ని ఇంట్లో అమ్మా, నాన్నకి చెప్పడంతో సరే అని చెప్పారు.

is tollywood not suitable for vidya-balan
is tollywood not suitable for vidya-balan

అయితే ఓ కండీషన్ కూడా పెట్టారు. ముందు చదువు పూర్తి చేయి..ఆ తర్వాత హీరోయిన్‌గా ప్రయత్నాలు చేసుకో అని. దాంతో అమ్మా నాన్నలు చెప్పినట్టుగానే చదువు పూర్తి చేసి, హీరోయిన్‌గా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా మలయాళంలో స్టార్ హీరో మోహన్‌లాల్ కి జంటగా చక్రం అనే సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా నిర్మాణంలో ఉండగా క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో మధ్యలోనే ఆపేశారు. దాంతో మలయాళం ఇండస్ట్రీలో విద్యకు ‘ఐరెన్‌లెగ్’ అని ముద్రపడింది.

Vidya Balan: విద్యాబాలన్ హీరోయిన్ అయ్యేందుకు ఎన్నో కష్టాలను అనుభవించింది.

ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీ మీద ఆశలు వదులుకొని తమిళం ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. 2002లో ‘రన్’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కింది. కానీ వేరే కారణాల వల్ల ఆ సినిమా నుంచి విద్యను తప్పించి మీరాజాస్మిన్‌ ను హీరోయిన్‌గా తీసుకున్నారు. దీని తర్వాత మనసెల్లం సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకొని మళ్ళీ త్రిష కృష్ణన్‌ ను తీసుకున్నారు. ఇలా తమిళంలో కూడా సైన్ చేసిన రెండు సినిమాల నుంచి విద్యను తొలగించడం ఆమెకి ఏమాత్రం అర్థం కాలేదు. కొంత అయోమయంలో పడింది.

ఎట్టకేలకి తమిళంలోనే 2003లో కలారి విక్రమన్ అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ వరకు వచ్చి ఆగిపోయింది. అలా విద్యాబాలన్ హీరోయిన్ అయ్యేందుకు ఎన్నో కష్టాలను అనుభవించింది. ఇక ఇక్కడ కూడా లాభం లేదనుకున్న విద్య బాలీవుడ్‌లో ప్రయత్నాలు సాగించింది. అప్పటికే కాస్త హిందీ సీమలో పరిచయాలు ఉండటంతో 2005లో పరిణీత సినిమాలో అవకాశం అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. అయినా ముందు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకొని హ్యాపీగానే తీసుకుంది.

Vidya Balan: విద్యాబాలన్‌కి ఎందుకనో కెరీర్ ప్రారంభం నుంచి సౌత్ ఇండస్ట్రీలు కలిసి రాలేదు.

ఈ క్రమంలో సంజయ్‌దత్ నటించిన లగే రహో మున్నాభాయ్‌లో హీరోయిన్‌గా నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. ఇందులో విద్య పోషించిన జాహ్నవి పాత్రతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆమె కెరీర్‌లో డర్టీ పిక్చర్ సినిమా ఓ ఛాలెంజ్. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకుంది విద్యబాలన్. హే బేబి, బూల్ బులయ్యా, కిస్మత్ కనెక్షన్, పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, కహానీ, ఘన్ చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్.. లాంటి సినిమాలతో స్టార్‌గా ఓ వెలుగు వెలుగింది.

ఇప్పటికీ ఆమెకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే విద్యాబాలన్‌కి ఎందుకనో కెరీర్ ప్రారంభం నుంచి సౌత్ ఇండస్ట్రీలు కలిసి రాలేదు. తెలుగులో మంచి కథలను ఎంచుకోకపోవడమే ఇందుకు ముఖ్య కారణం అనేది మాత్రం ఆమె నటించిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. నందమూరి తారకరామారవు బయోపిక్‌గా వచ్చిన ఎన్.టి.ఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచాయి. అయితే బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ అవకాశాలు అందుకుంటున్న హిట్ మాత్రం దక్కక మళ్ళీ ముంబై ఫ్లైటెక్కేస్తున్నారు. విద్యకి మరోసారి ఇక్కడ అవకాశాలు వస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

 


Share

Related posts

Dhivya dhuraisamy fabulous pics

Gallery Desk

BREAKING: ఐటీ అధికారులపై సెటైర్లు పేల్చిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..!

amrutha

`RRR`లో మ‌రో ఇద్ద‌రు బాలీవుడ్ తార‌లు

Siva Prasad