Pawan kalyan : పవన్ కళ్యాణ్ కోసం మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపు 10 ఏళ్ళ క్రితమే కోబలి అన్న టైటిల్ తో ఒక కథ రాసుకున్నాడు. ఆ కథ పవన్ కళ్యాణ్ కి కూడా ఎంతగానో నచ్చిందని ఈ ప్రాజెక్ట్ త్వరలో మొదలు పెట్టబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ వేరే సినిమాలతో బిజీ అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ వేరే సినిమాలతో బీజీ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో కోబలి కథ అనుకున్న తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి సినిమాలు కూడా వచ్చాయి. కానీ అనుకున్న కోబలి కథ మాత్రం సినిమాగా తీయలేకపోయారు.
ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి తర్వాత రాజకీయాలల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు. అంతేకాదు మరో 5 సినిమాలను కమిటయ్యాడు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్, హరిహర వీరమల్లు సెట్స్ మీదున్నాయి. అయితే రీ ఎంట్రీ తర్వాత పవన్ కమిటయిన సినిమాలలో త్రివిక్రమ్ .. పవన్ కోసం అనుకున్న కోబలి లేకపోవడం కాస్త షాకింగ్ విషయమే.
Pawan kalyan : త్రివిక్రమ్.. కోబలి కథ అమ్మేస్తున్నాడా..?
ఇక ఇప్పుడు పవన్ – రానా నటిస్తున్న సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. మాటలు అందిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కమిటయిన సినిమాలన్ని కంప్లీట్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. అంతేకాదు త్రివిక్రమ్ కూడా నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కోసం త్రివిక్రం రాసిన కోబలి కథను వేరే దర్శకుడికి అమ్మేయాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్. అయితే వేరే దర్శకుడైనా ఈ కథ పవన్ తో తీస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక నిజంగాగే త్రివిక్రమ్.. కోబలి కథ అమ్మేస్తున్నాడా అన్నది క్లారిటీ రావాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!