ప్రస్తుతం విజయ్ తలపతి, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘మాస్టర్’ సినిమా లో నటిస్తున్న విషయం విదితమే. విజయ్ తన తరువాత షెడ్యూల్ను జనవరి మొదటి వారంలో చెన్నైలోని ఒక ప్రముఖ స్టూడియోలో షూట్ చేయనున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్ మరో రెండు వారల వరకు జరగనున్నది.
అయితే, ఇటీవల ఈ చిత్రం ఒరిజినల్ స్క్రిప్ట్ కాదని, కొరియన్ చిత్రం సైలెన్స్డ్(Silenced) స్ఫూర్తితో ఉందని కథనాలు వచ్చాయి. ఈ కొరియన్ చిత్రం 2011 లో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికి విప్లవాత్మక సినిమాలలో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోయింది. వికీపీడియాలోని వివరణ ప్రకారం, సైలెన్స్డ్ సినిమా పాఠశాలలోని విద్యార్థులపై లైంగిక మరియు శారీరక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడే ఉపాధ్యాయుడి గురించిన కథట. ఈ చిత్ర బృందం ఇటీవల విభిన్న సామర్థ్యం ఉన్న పిల్లల కోసం ఒక పాఠశాలలో చిత్రీకరించారు.
ఈ సినిమాలో విజయ్ ఒక కాలేజీ ప్రొఫెసర్ పాత్రను పోషితున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం కొరియన్ చిత్రానికి అనుసరణ అంటూ వస్తున్న కథనాలను మాస్టర్ బృందం సన్నిహిత వర్గాలు తీవ్రంగా ఖండించాయి. విజయ్ కోసం లోకేష్ ఎంతో కాలంగా కస్టపడి సరికొత్త స్క్రిప్ట్ రాశారని వారు చెబుతున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా ఈ చిత్రం వివాదంపై మేకర్స్ ఇంకా స్పందించలేదు.
మాస్టర్లో విజయ్ తలపతి, విజయ్ సేతుపతి, మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా, శాంతను భాగ్యరాజ్, లింటు రోనీ, గౌరీ కిషన్, రమ్య సుబ్రమణియన్, సౌందర్య నందకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎక్స్బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!