Jabardasth Varsha : కొన్ని రోజుల క్రితం వరకు జబర్దస్త్ వర్ష Jabardasth Varsha అంటే కూడా ఎవ్వరికీ తెలియదు. తను మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి వచ్చినా.. ఎన్నో షోలలో పార్టిసిపేట్ చేసినా.. డ్యాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసినా రాని గుర్తింపు కేవలం ఒక్క జబర్దస్త్ ద్వారా వర్షకు వచ్చేసింది. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. మామూలు సెలబ్రిటీ కాదు. తన రేంజ్ మారిపోయింది. యాంకర్ గా కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.
జబర్దస్త్ వర్ష అంటేనే గుర్తొచ్చే మరో పేరు ఇమ్మాన్యుయేల్. వీళ్లిద్దరి మధ్య ఏముంది? అనేది బాహుబలి ప్రశ్న కన్నా పెద్ద ప్రశ్న అయిపోయింది.
జబర్దస్త్ లో వర్ష, ఇమ్మాన్యుయేల్ జంటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఈ జంట గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్లిద్దరూ ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ ను బాగా పండిస్తారు. ఒక సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఎంత క్రేజ్ వచ్చిందో.. ప్రస్తుతం ఈ జంటకు కూడా అంత క్రేజ్ వచ్చేసింది.
Jabardasth Varsha కు ప్రపోజ్ చేసిన ఇమ్మాన్యుయేల్
జబర్దస్త్ వర్షకు ఇమ్మాన్యుయేల్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపోజ్ చేశాడు. హార్ట్ షేప్ లో ఉన్న రెడ్ బెలూన్ ను వర్షకు ఇచ్చి.. వర్ష, హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చెప్పేయడంతో.. వర్ష ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ హార్ట్ ను అందుకుంది.
ఒక అబ్బాయి.. అమ్మాయికి హార్ట్ బెలూన్ ను ఇచ్చి.. హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పాడు అంటే అర్థం ఏంటి.. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అర్థం. ఆ అమ్మాయి అతడి ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది అంటే దాని అర్థం కూడా ఆ అమ్మాయి.. అతడిని లవ్ చేస్తోందని. చూద్దాం మరి.. వీళ్ల ప్రేమ ఎంత దూరం వెళ్తుందో?
తాజాగా 2 గంటల్లో ప్రేమించడం ఎలా? అనే కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ షోను ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి మరి.