NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ స్కెచ్‌…బాబు అడ్డంగా బుక్కాయిన‌ట్లేనా?

chandrababu naidu implementation for debts

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ మూడు రాజ‌ధానుల ఏర్పాటు. ఒక రాజ‌ధాని బ‌దులుగా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తోంది.  chandrababu naidu implementation for debts

మ‌రోవైపు రాజధాని భూములపై సిట్ విచార‌ణ జ‌రుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన నివేదిక విడుద‌లైంది. ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ కొత్త డౌట్లు వ్య‌క్తం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత నేడు యనమల రామకృష్ణుడు తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌లో కీల‌క అంశాలు వెల్ల‌డించారు.

అన్నింటా ఫెయిల‌యిన జ‌గ‌న్‌…

తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజధాని అమరావతిపై సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిందారోపణలు చేస్తున్నార‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆరోపించారు. కరోనా వైరస్ నియంత్రణలో సీఎం జగన్ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద‌ని తెలిపారు. దాడులు, దౌర్జన్యాలతో దళితులు, గిరిజనులకు దూరమైన వైసీపీ ప్ర‌భుత్వం బీసీలపై, ముస్లిం మైనారిటిలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు పాల్ప‌డుతోందని మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్‌కు మీటర్లు పెట్టే దురాలోచనలతో రైతుల్లో వ్యతిరేకత మహిళలపై అత్యాచారాలు, యువతకు ఉపాధి లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి ఉంద‌న్నారు. రాజధాని 3ముక్కలాట వంటి తుగ్లక్ చర్యలతో రాష్ట్రం అప్రదిష్టపాలు అయింద‌న్నారు. తమ వైఫల్యాలను కప్పిపెట్టేందుకే తెలుగుదేశంపై జగన్ మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు.

జ‌గ‌న్ పెద్ద త‌ప్పు చేశార‌ట‌

ఏడాదిన్నర అవుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు లేకపోవడం శోచనీయమ‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మండిప‌డ్డారు. ప్రజల పట్ల బాధ్యత, రాష్ట్రం పట్ల తన కర్తవ్యాన్ని విస్మరించి ప్రత్యర్ధులపై ప్రతీకారమే లక్ష్యంగా పని చేయడాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. ఐదేళ్ల పాలనపై కేబినెట్ సబ్ కమిటి నియమించిన చరిత్ర ఏ రాష్ట్రంలోనూ లేదు. ఆ కమిటి నివేదిక ఆధారంగా సిట్ నియమించడం మరో తప్పిదమ‌ని త‌ప్పుప‌ట్టారు. ఈ రెండింటి ఏర్పాటుపై హైకోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని తెలిపారు. కోర్టులో పెండింగ్ ఉన్న అంశంపై నివేదిక బైటపెట్టడం ధిక్కారమేన‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పేర్కొన్నారు.

అప్పుడు అలా…ఇప్పుడు ఇలా?

సబ్ కమిటి ఏర్పాటు, సిట్ నియామకమే తప్పిదాలనే అంశం కోర్టులో ఉన్నప్పుడు వాటి నివేదికలను ఎలా బైటపెడతారని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌శ్నించారు. “కేవలం చంద్రబాబుపై వ్యక్తిగతంగా, టీడీపీపై రాజకీయంగా ఉన్న కక్షతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలి పోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జ‌రిగిన‌ తన అవినీతిని బైటపెట్టారనే అక్కసుతోనే జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారు.“ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆరోపించారు. “రాజధాని నిర్ణయం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటి నివేదిక ప్రకారం జరిగింది. 2014-19 అసెంబ్లీలో ఉన్న అన్నిపార్టీల ఏకాభిప్రాయం మేరకే జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అమరావతిని స్వాగతించారు, 33వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ది చేయాలని సూచించారు. అన్ని పార్టీల ఆమోదం మేరకే అప్పట్లో రాజధాని ఎంపిక జరిగింది. 5ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజధాని సరిహద్దుల నిర్ణయంలో అవకతవకలు జరిగాయని చెప్పడం జగన్ కక్ష సాధింపులో భాగమే.“ అని య‌న‌మ‌ల మండిప‌డ్డారు.

బాబు బ్యాచ్ బాధ ఇదేనా?

ఈ సందర్భంగా య‌న‌మ‌ల రామకృష్ణుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “సబ్ కమిటిలో ఉన్నది జగన్ అనుచరులే, సిట్ లో ఉన్నది జగన్ ప్రభావితులే. కాబట్టి జగన్ చెప్పిందే సబ్ కమిటి ఇస్తుంది, సిట్ పేర్కొంటుంది. అందుకే ఈ రెండింటి ఏర్పాటును టీడీపీ వ్యతిరేకించింది. ఇప్పుడా విషయం న్యాయస్థానాల్లో పెండింగ్ ఉంది. ఇలాంటి సందర్భంలో నివేదికలు బైటపెట్టడం కోర్టు ధిక్కరణే“ అని ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. అయితే, టీడీపీ అవినీతి బ‌య‌ట‌ప‌డింద‌నే కోర్టు ధిక్కార‌ణ టీడీపీ గగ్గోలు చెందుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

author avatar
sridhar

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju