ప్రస్తుత కాలం లో చాలామంది దంపతులు సంతాన లేమితో బాధపడుతున్నారు. ఈ విషయం సంబంధించి అనేక సంతాన సమస్యలు నివృత్తి చేసేందుకు అనేక హాస్పిటల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇందుకోసం కొన్ని వేలలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు.
సంతానము కలగపోవడానికి సంబంధించి అనేక విషయాలు కారణమవుతాయి. ముఖ్యంగా మగవారిలో వీర్యకణాల లోపం, ఆడవారిలో అండాల సమస్య ఉండి అండం ఫలదీకరణ జరగకపోవడం ముఖ్యకారణాలు గా చెప్పుకోవచ్చు.ఒకవేళ ఇలాంటి సమస్యలు వుండి కూడా ఫలదీకరణం జరిగినా కచ్చితంగా వారికి అబార్షన్ జరుగుతోంది. స్త్రీలు గర్భవతి కాకపోవడానికి కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులలో కూడా అనేక శృంగారపరమైన అంశాలు కారణమవుతాయి అని డాక్టర్లు చెప్తున్నారు.
ఇకపోతే శుక్ర కణాలు 1.5 నుండి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటేనే ఆడవారు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటి సంఖ్య 15 మిలియన్ల నుండి 30 మిలియన్ల వరకు ఉండాలి. ఒకవేళ అంతకన్నా తక్కువగా ఉండి ఉంటే కూడా సమస్య కుకారణమవుతుంది. అలాగే వీర్యం లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటేనే గర్భవతి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివిఉంటే గర్భం దాల్చిన వెంటనే అబార్షన్ జరగడానికి కారణం అవుతుంది.
ముఖ్యంగా వీర్యం అనేది జిగట పదార్థంలా ఉండాలి. ఒకవేళ వీర్యం నీళ్లలా ఉంటే వారికి హార్మోన్ల సమస్య ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాటి వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. బిగుతైన దుస్తులు ధరించడం, ఎక్కువ సమయం పాటు కుర్చీలలో కూర్చొని పనిచేయడం లాంటి కొన్ని అంశాలు కూడా ఈ శుక్ర కణాల పై ప్రభావంచూపుతాయి. కాబట్టి ఇలాంటి లోపాలు ఉండడం వల్ల ఆడవారికి పిల్లలు పుట్టడం కష్టమే. ఒకవేళ గర్భం దాల్చిన వెంటనే అబార్షన్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటేనే వారి సంసారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతానం తో ఆనందం గా సాగుతుంది .