NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌తో ముందు పొత్తు.. వెన‌క వెన్నుపోటు.. బాబు మార్క్ రాజ‌కీయం…!

ఎస్ ఏపీలో ఎన్నిక‌ల వేడి మామూలుగా లేదు. ఇప్ప‌టికే జ‌న‌సేన – టీడీపీ పొత్తు ఖ‌రారైంది. అటు ఈ కూట‌మిలోకి బీజేపీ కూడా వ‌చ్చి చేరే వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌కు 26 అసెంబ్లీ, 2 – 3 పార్ల‌మెంటు సీట్లు ఇవ్వాల‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అంతా బాగానే ఉంది. అటు బీజేపీ కూడా పొత్తు ఉండాల‌ని తాము అడిగిన‌న్ని సీట్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబుపై ప్రెజ‌ర్ చేస్తుండ‌డంతో చంద్ర‌బాబు ఏం చేయాలో తెలియ‌క డైల‌మాలో ప‌డిపోయార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇప్పుడు జ‌న‌సేన‌కు 26 సీట్లు కూడా ఇచ్చేందుకు బాబు ఇష్టంగా లేర‌ని అంటున్నారు.

ప‌వ‌న్ క‌నీసం 30 కు పైగా సీట్లు తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. చంద్ర‌బాబు జ‌న‌సేన‌కు ముందు కొన్ని సీట్లు ఇచ్చి ఆ త‌ర్వాత జ‌న‌సేన గెల‌వ‌దు అని తాను అనుకున్న చోట్ల టీడీపీ అభ్య‌ర్థుల‌కు కూడా బీఫామ్‌లు ఇచ్చి నామినేష‌న్లు వేయించాల‌న్న ప్లాన్‌లో ఉన్నార‌ని.. ఈ ప్లాన్ గ‌తంలో బాబు మిత్ర‌ప‌క్షాల‌తో పొత్తులు పెట్టుకుని ఫాలో అయ్యార‌ని.. ఈ ఎన్నిక‌ల్లోనూ అలాగే ముందుకు వెళ్లేలా ఉన్నార‌ని తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్ర‌బాబు ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చారు. అందులోనూ కొన్ని సీట్ల‌లో మ‌ళ్లీ టీడీపీ పోటీ చేసింది. అదేంటంటే అక్క‌డ బీజేపీకి అంత సీన్ లేద‌ని.. అక్క‌డ మాత్రం ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కారు. మ‌రి ఇది మిత్ర‌ధ‌ర్మం విస్మ‌రించ‌డ‌మే అని చెప్పాలి. 2014లో టీడీపీ పొత్తులో భాగంగా ఖ‌చ్చితంగా ఓడిపోయే రాజంపేట‌, తిరుప‌తి పార్ల‌మెంటు సీట్లు ఇచ్చింది. అలాగే కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీకి ఇచ్చి త‌ర్వాత టీడీపీ అభ్య‌ర్థుల‌కు బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టింది.

కాస్త ముందుకు వెళితే 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ – టీఆర్ఎస్ ( అప్పుడు) పొత్తు ఉన్న‌ప్పుడు కూడా టీఆర్ఎస్‌కు ఇచ్చిన సీట్ల‌లోనే కొన్ని చోట్ల చంద్ర‌బాబు టీడీపీ వాళ్ల‌కు బీఫామ్‌లు ఇచ్చి పెటీ చేయించాడు. ఇలా పొత్తు పొత్తు అంటూనే పొత్తు ధ‌ర్మం విస్మ‌రించ‌డం చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇప్పుడు అదే వెన్నుపోటు జ‌నసేన‌కు కూడా బాబు పొడుస్తారా ? అన్న చ‌ర్చ‌లు ఉన్నాయి. జ‌న‌సేన‌ను కూడా ఇదే భ‌యం వెంటాడుతోంది.

చంద్ర‌బాబు ఏం చేసినా ప‌వ‌న్ మాట్లాడ‌లేని ప‌రిస్థితి. సింగిల్గా వెళితే పార్టీ మ‌ళ్లీ ఒక్క‌సీటు అయినా గెలుస్తుందా ? క‌నీసం తాను ఎమ్మెల్యేగా అయినా గెలుస్తానా ? అన్న డౌట్లు ప‌వ‌న్‌కు ఉన్నాయి. అందుకే ప‌వ‌న్ మౌనంతోనే ఉంటాడు. ఎటు తిరిగి జ‌న‌సేస‌, ప‌వ‌న్‌ను న‌మ్ముకున్న నేత‌లు, కేడ‌ర్ మునిగిపోయేలా వ్య‌వ‌హారం ఉంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N