NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ‘ దేవినేని ఉమా ‘ ముస‌లం … త్యాగ‌మూర్తిగా మిగులుతాడా…!

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో పేరుకు మూడు ద‌శాబ్దాల పాటు వ‌న్ మ్యాన్ షోగా రాజ‌కీయం చేస్తున్నాడు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. పేరుకు సీనియ‌ర్ అయినా ఆయ‌న దెబ్బ‌కు టీడీపీ నుంచి ఎంతోమంది ప‌ట్టున్న నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఆయ‌న రాజ‌కీయంగా ఎవ్వ‌రిని ఎద‌గ‌నీయ‌రు అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఎంత పెద్ద మ‌ర్రి చెట్టు అయినా ఏదో ఒక గాలికి కొట్టుకుపోతుంద‌న్న నానుడి ఉమా విష‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో ఫ్రూవ్ అయ్యింది. మైల‌వ‌రం నుంచి త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వ‌సంత కుటుంబానికి చెందిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ చేతిలో చావుదెబ్బ‌తిన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, కేశినేని పార్టీకి దూర‌మైన ఇప్పుడు టీడీపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న గ‌ద్దే రామ్మోహ‌న్ జిల్లాలో టీడీపీకీ కింగ్‌గా ఉన్నారు. 20 ఏళ్ల‌కు పైగా జిల్లాలో టీడీపీ నేత‌లు అంద‌రిని అణిచివేస్తూ, తొక్కుకుంటూ రాజ‌కీయం చేస్తూ వ‌చ్చిన ఉమాకు ఇప్పుడు త‌న సొంత పార్టీలోనే క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న‌పై గెలిచిన‌, పైగా ఉమాకు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ టీడీపీలో చేరుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నుంచి గెలిచిన వ‌సంత అక్క‌డ ఇమ‌డ లేక‌పోయారు. మంత్రి జోగి ర‌మేస్ ప‌దేప‌దే మైల‌వ‌రంలో వేళ్లు పెడుతున్నారు. జ‌గ‌న్‌కు చెప్పినా ప‌ట్టించుకోలేదు.

ఇప్పుడు టీడీపీలోకి వ‌స్తుండ‌డంతో పాటు మైల‌వ‌రం నుంచే తాను పోటీ చేస్తాన‌ని. ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తాను ఎంతో సేవ‌చేశాన‌ని.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంద‌ని.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌తో త‌న‌కు ఓ అనుబంధం ఏర్ప‌డింద‌ని చెపుతున్నారు. చంద్ర‌బాబు, లోకేష్ కూడా మైల‌వ‌రంలో ఉమాపై సొంత పార్టీలోనే వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ సీటు వ‌సంత‌కే ఇచ్చి.. ఉమాను పెన‌మ‌లూరు నుంచి పోటీ చేయించే ఆలోచ‌న‌లో ఉన్నారు.

2014లో ఇక్క‌డ ఉమా గెలిచి మంత్రి అయినా ఆయ‌న‌కు కేవ‌లం 7 వేల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. ఆ త‌ర్వాత మంత్రి అయినా నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ వాళ్ల‌నే నానా ఇబ్బందులు పెట్టాడు. వీళ్లంతా గ‌త ఎన్నిక‌ల్లో టైం కోసం వెయిట్ చేసి మ‌రీ ఉమాను దెబ్బ‌కొట్టారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా వారితో ఉమా గ్యాప్ స‌రిచేసుకోలేదు. ఇప్పుడు రాజ‌కీయం మారి వ‌సంత టీడీపీలోకి వ‌స్తుండ‌డంతో ఉమాకు త‌ట్టుకోలేక‌పోతున్నాడు.. ఏడుపులు, పెడ‌బొబ్బ‌లు పెడుతున్నాడు. వ‌సంత‌పై అవాకులు చెవాకులు పేలుస్తున్నాడు.

ఉమాను మైల‌వ‌రం నుంచి మార్చేయాల‌ని చంద్ర‌బాబు బ‌లంగా నిర్ణ‌యం తీసుకుంటోన్న నేప‌థ్యంలో ఉమాకు ముందున్న‌ది ఒక్క‌టే ఆప్ష‌న్‌. అయిష్టంగా అయినా పెన‌మ‌లూరు వెళ్లి పోటీ చేయాలి. అప్పుడు అక్క‌డ మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ వ‌ర్గంలో ఇబ్బందులు త‌ప్ప‌వు. అది ఇష్టంలేక‌పోతే టీడీపీలో మ‌నోడు ముస‌లం స్టార్ట్ అవుతుంది. లేదా టీడీపీలో సీటు త్యాగం చేసి త్యాగ‌మూర్తిగా మిగిలిపోవాలి.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?