కర్నూలు చేరుకున్న జనసేనాని పవన్

కర్నూలు, ఫిబ్రవరి 24: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు చేరుకున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన కర్నూలు జిల్లా కేంద్రానికి బయలుదేరారు.

జిల్లాలో మూడు రోజుల పర్యటనకు విచ్చేస్తున్న పవన కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జన సేన కార్యకర్తలు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. పట్టణంలోని సి క్యాంప్ నుండి కొండారెడ్డి బురుజు వరకూ జరిగే రోడ్‌షోలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు.

25వ తేదీ ఆదోని, 26న ఆళ్లగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.