NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీతో పొత్తు త‌ర్వాత జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు ఎన్ని సీట్లు ఇస్తారంటూ ఒక్కటే చ‌ర్చ జ‌రిగింది. ముందు నుంచి కూడా జ‌న‌సేన‌కు 25కు మించి అసెంబ్లీ సీట్లు ఇవ్వ‌ర‌ని..ఇక ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే 2 లేదా మూడు మాత్ర‌మే ఉంటాయ‌ని అంద‌రూ అనుకున్నారు. అంద‌రూ అనుకున్న‌ట్టుగానే.. ఇంకా చెప్పాలంటే ఆ 25 సీట్లు కూడా బాబు ప‌వ‌న్ పార్టీకి ఇవ్వ‌లేదు. ఈ రోజు పొత్తులో భాగంగా తొలి లిస్ట్‌ను ప‌వ‌న్‌, చంద్ర‌బాబు క‌లిసి ప్ర‌క‌టించారు. జ‌న‌సేన 24 అసెంబ్లీ, 3 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

ఇవి త‌మ రేంజ్‌కు చాలా చాలా త‌క్కువ‌ని జ‌న సైనికులు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. కాపు, కాపు ఉప కులాల ఓట్లే ఏపీలో మొత్తం మీద 25 శాతం వ‌ర‌కు ఉంటాయ‌ని ప్ర‌చారం ఉంది. ఈ లెక్క‌న ప‌వ‌న్ మొత్తం 175 సీట్ల‌లో నాలుగో వంతు సీట్లు తీసుకున్నా 40 + ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రీ ఘోరంగా ముష్టి వేసిన‌ట్టు చంద్ర‌బాబు త‌మ పార్టీకి 24 సీట్లు మాత్ర‌మే ఇచ్చార‌ని.. అయినా కూడా స్టేజ్ మీద ప‌వ‌న్ ఏదో సాధించిన‌ట్టు బిల్డ‌ప్ ఇవ్వ‌డం త‌మ‌కు ఏ మాత్రం మింగుడు ప‌డ‌డం లేద‌ని వారు వాపోతున్నారు.

అటు చిరంజీవి, ఇటు ప‌వ‌న్‌.. ఇంకా చెప్పాలంటే మెగాభిమానుల ఆత్మాభిమానం మొత్తం తాక‌ట్టు పెట్టి… ఇటు కులాన్ని కూడా బాబు ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టుకుని ప‌వ‌న్ సాధించిన సీట్లు కేవ‌లం 24.. అస్స‌లు దీనిని తాము త‌ట్టుకోలేక‌పోతున్నామంటూ జ‌న‌సేన ఫ్యాన్స్ గ‌గ్గోలు మామూలుగా లేదు. చాలా మంది జ‌న‌సేన ఫ్యాన్స్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. ఇలాంటి చోట తాము ఉండ‌లేమ‌ని కామెంట్లు పెట్టి మ‌రీ బ‌య‌ట‌కు పోతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ప్యాకేజ్ స్టార్ అంటే తాము న‌మ్మ‌లేద‌ని.. కానీ ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ ప‌వ‌న్ అంటే తాము న‌మ్మాల్సి వ‌స్తుంద‌ని జ‌న సైనికులే చెపుతున్నారు. ఏలూరులో సీటు ఆశించిన రెడ్డి అప్ప‌ల‌నాయుడు, త‌ణుకులో సీటు ఆశించిన విడివాడ రామ‌చంద్ర‌రావు వ‌ర్గాలు అయితే భ‌గ్గుమంటున్నాయి. అసలు ఇక్క‌డ టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామ‌ని వారు స‌వాళ్లు రువ్వుతున్నారు. త‌ణుకులో చంద్ర‌బాబు సీటు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ‌… అయితే అక్క‌డ జ‌న‌సేన సీటు ఆశించిన విడివాడ రామ‌చంద్ర‌రావు కూడా క‌మ్మే.. జ‌న‌సేన క‌మ్మ నేత కోసం త‌మ పార్టీ క‌మ్మ నేత‌ను కూడా బాబు వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని వారు మండిప‌డుతున్నారు.

అస‌లు ఇలాంటి పొత్తు ఉన్నా లేక‌పోయినా ఒక్క‌టే అని వారు ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా జ‌న‌సేన‌కు బాబు ఇచ్చిన 24 సీట్లు ఆ పార్టీ కేడ‌ర్‌, నాయ‌కుల‌కు ఏ మాత్రం ఆమోద‌యోగ్యంగా లేదు. ఇలాంటి టైంలో మ‌రీ ఈ రెండుపార్టీల కేడ‌ర్ మ‌ధ్య ఓట్ల బ‌ద‌లాయింపు ఎలా జ‌రుగుతుంద‌న్న‌ది మాత్రం కాస్త సస్పెన్స్‌గానే క‌నిపిస్తోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N