NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

ఓ వైపు ఏపీలో ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోయింది. అటు చూస్తే వైసీపీ ఇప్ప‌టికే ఆరేడు జాబితాల్లో టిక్కెట్లు ప్ర‌క‌టిస్తూ దూసుకుపోతోంది. చంద్ర‌బాబు త‌మ‌కు 30 నుంచి 40 సీట్ల లోపు అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తార‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఎదురు చూసిన జ‌న సైనికుల ఆశ‌ల‌పై ఈ రోజు ప్రెస్‌మీట్ సాక్షిగా ఆయ‌న నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌య్యింది. చంద్ర‌బాబు ప‌క్క‌నే ప‌వ‌న్‌, నాగ‌బాబును పెట్టుకుని జ‌న‌సేన 24 అసెంబ్లీ, 3 పార్ల‌మెంటు స్థానాల‌కు పోటీ చేస్తుంద‌ని చెప్పిన వెంట‌నే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ‌న సైనికుల‌తో పాటు జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసేందుకు ఎంతో ఆస‌క్తితో ఉన్న నాయ‌కుల ఆశ‌లు ఒక్క‌సారిగా నీరు గారిపోయాయి.

చంద్ర‌బాబు అంటేనే ఎంత రాజ‌కీయ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న రాజ‌కీయ చాణ‌క్యం దెబ్బ‌తో ఎంతోమంది మ‌హామ‌హులే చిత్తైపోయారు. ప‌వ‌న్ లాంటి రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త‌, రాజ‌కీయ అనుభ‌వం లేని.. ఇంకా చెప్పాలంటే ఒక్క‌సారి కూడా ఎమ్మెల్యేగా గెల‌వ‌ని ప‌వ‌న్ ఎందుకు స‌రితూగుతాడు.. అస‌లు చంద్ర‌బాబు మంత్రాంగాన్ని ప‌వ‌న్ ఎంత వ‌ర‌కు ఎదుర్కొంటాడు. చంద్ర‌బాబు వేసిన ఎత్తు దెబ్బ‌కు ప‌వ‌న్ ఒక్క‌సారి కాదు రెండు సార్లు చిత్తైపోయాడ‌ని జ‌న‌సేన ఫ్యాన్సే గ‌గ్గోలు పెడుతున్నారు.

ఇక చంద్ర‌బాబు తాను పోటీ చేసే సీటుతో పాటు త‌న కొడుకు, వియ్యంకుడు పోటీ చేసే సీటును కూడా ఎనౌన్స్ చేశారు. ప‌వ‌న్ పార్టీ మొత్తం 24 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని చెపితే అందులో కేవ‌లం 5 సీట్ల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. అందులో ప‌వ‌న్ పోటీ చేసే సీటు కూడా లేదు. ఇక జ‌న‌సేన పోటీ చేసే మిగిలిన 19 సీట్ల‌లోనూ కొన్ని చోట్ల అభ్య‌ర్థుల ఎంపిక ప‌వ‌న్ త‌న మంత్రాంగం ప్ర‌ద‌ర్శించ‌బోతున్నాడ‌ని అంటున్నారు.

టీడీపీ నుంచి సీట్లు రాని కొంద‌రు టాప్ లీడ‌ర్ల‌ను తానే జ‌న‌సేన‌లోకి పంపి.. ఆ పార్టీ త‌ర‌పున బీ ఫామ్‌లు ఇప్పించి గెలిపించేలా మంత్రాంగం న‌డుపుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో బీజేపీలోనూ చంద్ర‌బాబు ఇదే టెక్నిక్ ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా కామినేని శ్రీనివాస్‌తో పాటు ఒక‌రిద్ద‌రు టీడీపీ నేత‌ల‌ను తానే జ‌న‌సేన‌లోకి పంపి ఆ పార్టీ త‌ర‌పున బీఫామ్‌లు వ‌చ్చేలా చ‌క్రం తిప్పుతున్నార‌ని.. ఓవ‌రాల్‌గా బాబు ప‌న్నిన రాజ‌కీయ వ్యూహంలో ప‌వ‌న్ ఇరుక్కుపోయార‌ని అంటున్నారు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N