Jr NTR: దేశంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. భారీ సినీ నేపథ్యం ఉన్నప్పటికీ తన ప్రతిభ, స్వయంకృషితో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రాంతీయ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. దేశ విదేశాల్లో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అయితే ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఎన్టీఆర్ ఇతరులకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. తన కోస్టార్స్ మరియు అభిమానులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతాడు. పబ్లిక్ లో ఎన్టీఆర్ ఇతరులపై అరవడం కోప్పడడం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటుంది. సహజంగానే ఎన్టీఆర్ కు సహనం ఎక్కువ. అలాంటి ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్ల పై అరిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ముంబైలో ఉన్న ఎన్టీఆర్ బ్లూ జీన్స్ మరియు సింపుల్ వైట్ షర్ట్ ధరించి ఫోన్ మాట్లాడుతూ ఒక హోటల్ లోకి వెళ్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ను చూడగానే అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ అంతా ఆయన వెంటపడ్డారు. హోటల్ లోపలికి వెళ్తున్న సమయంలో కూడా ఫోటోగ్రాఫర్లు ఎంట్రీ దగ్గరకు వెళ్లి మరీ దగ్గరగా ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. వారి ప్రవర్తనకు సహనాన్ని కోల్పోయిన ఎన్టీఆర్ `ఓయ్..` ఫోటోలు తీయొద్దంటూ గట్టిగా అరిచేశారు.
అయితే ఫోటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ అరవటానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో తన డెబ్యూ మూవీకి సైన్ చేశాడు. అదే వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ఇది. ఇటీవల దేవర మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. వార్ 2 షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్ళాడు. అయితే వార్ 2 కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టిన రోజు నుంచి ఫోటోగ్రాఫర్లు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
వార్ 2 మూవీ కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. తన మేకోవర్ ను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే తన లుక్ ను గోప్యంగా ఉంచడానికి వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అది అర్థం చేసుకోకుండా కొందరు ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం చూపించారు. అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. దాంతో తీవ్ర అసహనానికి లోనైన ఎన్టీఆర్ ఫోటోగ్రాఫర్లపై ఫస్ట్ టైమ్ పబ్లిక్ లో అరిచేశారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న బాలీవుడ్ క్రిటిక్స్ ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడానికి ప్రయత్నించారు.
అయితే వారికి ధీటుగా సౌత్ మూవీ లవర్స్ సమాధానాలు ఇస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని.. వారికంటూ పర్సనల్ లైఫ్ ఉంటుందని.. అందులో కూడా వేలు పెట్టడం కరెక్ట్ కాదంటూ ఎన్టీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఫోటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఫైర్ అయిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కాగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 రోజులు కాల్షీట్స్ ఇచ్చాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం 2025 ఆగస్టులో విడుదల కానుంది.
https://www.instagram.com/reel/C6LyDHdIvR_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==