పెళ్లి తరువాత కాజల్ సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఆచార్య చిత్రంలో చివరిగా కనిపించింది ఈ చందమామ. సినిమాలు చేయనప్పటికీ ఈ అమ్మడు మాత్రం కోట్లు సంపాదిస్తోంది. తాను గర్భంతో ఉన్న 9 నెలల కాలంలోనూ బేబీ హెల్త్ ప్రొడక్ట్స్, ఉమెన్ హెల్త్ ప్రొడక్ట్స్‌ను ఎండోర్స్ చేయడం ద్వారా రూ.కోట్లు వెనకేసింది. గర్భం దాల్చిన దగ్గర నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైన కాజల్ ఇప్పుడు తన సినిమా రెమ్యునరేషన్‌ని ఏ మాత్రం తగ్గకుండా సంపాదిస్తోంది.
ఇంట్లో ఉండే కోట్లు సంపాదిస్తున్న కాజల్
పిల్లాడు పుట్టిన తరువాత కూడా కోట్లు రూపాయలు సింపుల్‌గా ఆర్జిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పిల్లలు పుట్టిన తరువాత నీరసించిన తల్లి ఏ ఆహారం తీసుకోవాలి?? శరీర సౌందర్యం ఎలా పెంచుకోవాలి?? అనే వాటిపై చిట్కాలు ఇస్తూ శరీర సౌందర్యం పెంచే ఉత్పత్తులని ప్రమోట్ చేస్తోంది కాజల్. యాడ్ షూట్లు కూడా చేసేస్తోంది. అలానే బుడ్డోడిని అడ్డం పెట్టుకొని బానే సంపాదిస్తోంది. పెళ్లి అయిన తరువాత పలు మెగా ప్రాజెక్ట్స్ ను వదులుకున్నప్పటికీ, కాజల్ చేతిలో ప్రస్తుతం భారతీయుడు 2తో పాటుగా మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
కాజల్ రీఎంట్రీ ఇస్తుందా?
కాజల్ ఇక రీఎంట్రీ ఇచ్చే అవకాశాలే లేవని అభిమానులు తెగ బాధపడిపోతుంటారు. రీఎంట్రీ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. కాజల్ మాత్రం కొత్తగా ఎక్కువ సినిమాలు ఒప్పుకోవడం లేదు. కరుంగాపియం, ఘోస్టీ, ఉమా సినిమాల్లో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ వీటి గురించి మాత్రం ఎక్కువ అప్డేట్స్ లేవు. విక్రమ్‌తో కలిసి గరుడ సినిమాలో కూడా కాజల్ నటిస్తున్నట్లు సమాచారం. తల్లయిన తర్వాత కూడా ఆమె ఎప్పటిలాగే అలరిస్తుందో లేదా సినిమాకి క్రమక్రమంగా దూరమవుతుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!