Kajal Aggarwal: గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా తో పాటుగా మంచు విష్ణు హీరో గా నటిస్తున్న మోసగాళ్లు సినిమాలో కూడా నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కాజల్ అన్ని భాషల సినిమాలులో నటిస్తూ మరింత బిజీగా మారింది. ఇంత బిజీ లో కూడా వెబ్ సిరీస్ పై తన దృష్టి పెట్టింది.
త్వరలోనే కాజల్ తొలిసారిగా డిజిటల్ ఫ్లాట్ ఫారం మీద కనిపించనున్నది. ఆమె ఒక వెబ్ సీరీస్ లో నటించడానికి సిద్ధమవుతోందట. ఇప్పటికే టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్స్ తమన్నా, శృతిహాసన్, నిత్యామీనన్, సమంత డిజిటల్ మీడియాలోకి తెరంగేట్రం చేసి సక్సెస్ఫుల్ అయిన సంగతి విదితమే. సమంత అక్కినేని కూడా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. సమంత వెబ్ సీరీస్ ఫిబ్రవరి 12న డిజిటల్ ప్ఫ్లాట్ ఫారం లో స్ట్రీమ్ కానున్నది.
ఇక త్వరలోనే కాజల్ అదే బాటలో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. “లైవ్ టెలికాస్ట్” పేరుతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నది. అయితే ఈ వెబ్ సీరీస్ కు వెంకట్ ప్రభు అనే ఒక తమిళ దర్శకుడు డైరెక్షన్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ మొదటి సారిగా దెయ్యం పాత్రలో ఈ వెబ్ సీరీస్ లో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నది. ఇప్పటికే ఎన్నో విభిన్న పాత్రలలో కనిపించిన కాజల్ ఈ పాత్ర లో ఎలా నటిస్తుందో అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొన్నది. ఈ వెబ్ సీరీస్ ను హిందీతో పాటుగా అన్ని దక్షిణాది భాషలలోనూ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్నది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!