కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకొచ్చి దాదాపు 14 ఏళ్ళు అవుతోంది. తెలుగు, తమిళం తో పాటు హిందీ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. ఇప్పటికీ కాజల్ కి సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం తన చేతిలో ఉన్నవన్ని భారీ ప్రాజెక్ట్సే. అంతేకాదు వాటిలో ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలుండటం విశేషం.
ఇక కాజల్ సోషల్ మీడియా ఫాలోయింగ్ లోను యమా ఫాస్ట్ గా ఉంది. బాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉండటం ఆశ్చర్యకరం. సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరిలోను కాజల్ అగర్వాల్ కే హైయ్యెస్ట్ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కాజల్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఈ విషయంలో కాజల్.. అక్కినేని సమంతని కిందకి దింపేసింది. సమంత, కాజల్ కు మధ్య ఫాలోవర్స్ సంఖ్యలో పెద్ద తేడా లేనప్పటికి కాజల్ టాప్ లో ఉండి సమంత కి షాకిచ్చింది.
ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ అన్ని కలిపి కాజల్ కు ఏకంగా 42 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ కి కూడా ఈ రేంజ్ లో ఫాలోవర్స్ లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాజల్ అగర్వాల్ మొత్తం ఫాలోవర్స్ సంఖ్య 42 మిలియన్స్. ఆ తర్వాత స్థానంలో ఉన్న సమంత ను ఫాలో అవుతున్న వాళ్ళు 28.5 మిలియన్ లు. రెండవ స్థానంలో ఉన్న సమంత కంటే కాజల్ ఫాలోవర్స్ విషయంలో చాలా దూరంలో ఉంది. ఇక మూడవ స్థానంలో రకుల్ ప్రీత్ ఉంది. రకుల్ కు సమంత కంటే ఒక్క మిలియన్ తక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో అనుష్క ఉండగా 17.6 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తమన్నా 15.9 మిలియన్ ల ఫాలోవర్స్…. ఆ తర్వాత ఇలియానా 15.5 మిలియన్ ల ఫాలోవర్స్ ను.. కీర్తి సురేష్ 15 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.
ఇన్నాళ్ళు హీరోల ఫాలోవర్స్ గురించే చెప్పుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు తమ అభిమాన హీరోయిన్స్ గురించి చెప్పుకుంటున్నారు. చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా హీరోయిన్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి.